Advertisement

  • కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భారీగా తగ్గిన కార్బన్ ఉద్గారాలు

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భారీగా తగ్గిన కార్బన్ ఉద్గారాలు

By: Sankar Fri, 11 Dec 2020 5:02 PM

కరోనా కారణంగా ప్రపంచ వ్యాప్తంగా భారీగా తగ్గిన కార్బన్ ఉద్గారాలు


ఈ ఏడాది మొత్తం కరోనా కారణంగా ప్రపంచ దేశాలు చాల వరకు లాక్ డౌన్ లోనే ఉన్నాయి ..లాక్ డౌన్ ఎత్తివేసిన కూడా ఇంతకుముందులాగా ప్రజలు బయటకు వచ్చేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదు..దీనితో చెడులో మేలుగా కరోనా కారణంగా కార్బన్ ఉద్గరాలూ 2019 తో పోల్చుకుంటే 2020 లో ఘననీయంగా తగ్గాయి ...

2019లో ఈ సమయంలో వాతావరణంలో ఉద్గారాలతో 2020లో ఇదే సమయానికి ప్రపంచ వాతావరణంలో ఉన్న కర్బన ఉద్గారాలను పోల్చి చూసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా సరాసరి ఏడు శాతం కర్బన ఉద్గారాలు తగ్గిపోయాయి. ఇక్కడ ఏడు శాతమంటే 240 టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గాయన్న మాట.

అన్ని దేశాలకన్నా బ్రిటన్‌లో 13 శాతం తగ్గగా, అమెరికాలో 12 శాతం, యూరోపియన్‌ కూటమి దేశాల్లో 11 శాతం కర్బన ఉద్గారాలు తగ్గాయి. ప్రపంచవ్యాప్తంగా ఏటా 34 గిగా టన్నుల కర్బన ఉద్గారాలు వాతావరణంలో కలుస్తాయి. ఒక్క గిగా టన్ను అంటే వంద కోట్ల టన్నులు. బ్రిటన్‌లో ఏకంగా 13 శాతం కర్బన ఉద్గారాలు తగ్గడానికి ప్రధాన కారణం రవాణా రంగమే. జాతీయ లాక్‌డౌన్‌లను రెండుసార్లు అమలు చేయడం వల్ల ప్రధాన రవాణా రంగం దాదాపు నిలిచిపోయింది.

Tags :
|

Advertisement