Advertisement

  • కరోనా తర్వాత ప్రపంచంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి ..ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు

కరోనా తర్వాత ప్రపంచంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి ..ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు

By: Sankar Wed, 07 Oct 2020 8:32 PM

కరోనా తర్వాత ప్రపంచంలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి ..ప్రపంచ బ్యాంకు సంచలన వ్యాఖ్యలు


ప్రస్తుతం ప్రపంచాన్ని కరోనా అల్లకల్లోలం చేస్తున్నది. కరోనా కారణంగా ఇప్పటికే లక్షలాది మంది మృత్యువాత పడ్డారు. ఉద్యోగాలు కోల్పోయారు. కరోనా సమయంలో పరిశ్రమలు మూతపడ్డాయి. తిరిగి తెరుచుకున్నప్పటికీ పరిమిత సంఖ్యలోనే ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నారు.

టెక్నాలజీ వినియోగం పెరగడంతో, టెక్నాలజీ సహాయంలో ఎలాంటి వ్యాధులు సోకని రోబోలను పరిశ్రమల్లో వినియోగిస్తున్నారు. దీంతో మ్యాన్ పవర్ తగ్గిపోయింది. ఫలితంగా ఉద్యోగాలు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 2021 నాటికి ప్రపంచంలో 15 కోట్ల మంది జనాభా చేతిలో రూపాయి కూడా లేకుండా తీవ్రమైన దరిద్రాన్ని అనుభవిస్తారని ప్రపంచబ్యాంక్ పేర్కొన్నది. ఉద్యోగాలు కోల్పోవడంతో ప్రపంచంలో పేదరికం మరింత పెరిగిపోతుందని ప్రపంచబ్యాంక్ అంచనా వేస్తోంది.

వాక్సిన్ వస్తే పరిస్థితి అంతా తిరిగి మాములుగా మారిపోతుందని అనుకుంటున్నారని, కానీ, కరోనా తరువాత ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోబోతున్నాయని ప్రపంచబ్యాంక్ వెల్లడించింది. మార్పులకు అనుగుణంగా టెక్నాలజీని అందిపుచ్చుకున్న వ్యక్తుల జీవనం అద్భుతంగా ఉంటుందని, దాని గురించి పట్టించుకోని వ్యక్తుల జీవితం దారుణంగా మారిపోతుందని ప్రపంచ బ్యాంక్ అంచనా వేసింది.

Tags :
|

Advertisement