Advertisement

  • తెలంగాణలో మెల్లమెల్లగా ప్రజా ప్రతినిధులను వెంటాడుతున్న కరోనా

తెలంగాణలో మెల్లమెల్లగా ప్రజా ప్రతినిధులను వెంటాడుతున్న కరోనా

By: chandrasekar Tue, 30 June 2020 11:31 AM

తెలంగాణలో మెల్లమెల్లగా ప్రజా ప్రతినిధులను వెంటాడుతున్న కరోనా


ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 14,000 దాటింది. రోజురోజు కి కేసుల సొంఖ్య పెరుగుతూనే ఉంది. తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం, హోం శాఖ మంత్రి మహమూద్ అలీకి కరోనా టెస్టులు జరపగా పాజిటివ్ అని తేలింది. వెంటనే ఆయన అపోలో ఆస్పత్రిలో చేరారు.

ఇటీవల మంత్రికి చెందిన కొందరు సెక్యూరిటీ సిబ్బందికి కరోనా సోకినట్లు తేలడంతో మూడు రోజుల కిందట ఆయనకు టెస్టు చేశారు. తాజాగా టెస్టు రిపోర్టు వచ్చింది. ఐతే మహమూద్ అలీకి ఆస్తమా కూడా ఉంది. అందువల్ల కరోనా లక్షణాలు పెద్దగా లేకపోయినా ముందుగానే ఆయన్ని ఆస్పత్రిలో చేర్చారు కుటుంబ సభ్యులు. తన గన్‌మెన్‌కి కరోనా పాజిటివ్ అని తేలినా హోంమంత్రి క్వారంటైన్ అవ్వలేదు.

ఇటీవల హరితహారం కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రితోపాటూ సిటీ పోలీస్ కమిషనర్ కూడా పాల్గొన్నారు. ఇప్పటికే ముగ్గురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, గణేష్ గుప్తా, బాజిరెడ్డి గోవర్దన్‌లకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఇక కాంగ్రెస్‌లో సీనియర్ నేత వి.హనమంతరావు కూడా కరోనా బారిన పడ్డారు. మెల్లమెల్లగా ప్రజా ప్రతినిధులను ఈ వైరస్ వెంటాడుతోంది.

మరోపైపు పోలీసులు అలర్ట్ అయ్యారు. హోంమంత్రితో తిరిగిన వారిని క్వారంటైన్‌కు పంపిస్తున్నారు. అలాగే హోంమంత్రి ఇల్లు ఉండే చుట్టుపక్కల ప్రాంతాల్లో మున్సిపల్ సిబ్బంది శానిటైజ్ చేస్తున్నారు. హోంమంత్రి ఆరోగ్యంపై ఇతర మంత్రులు ఎలా ఉంది అని అడుగుతున్నారు.

కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. ప్రస్తుతానికి మంత్రికి అత్యంత తక్కువగానే లక్షణాలు ఉన్నట్లు తెలుస్తోంది. GHMC పరిధిలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో ఆ ప్రాంతంలో మరోసారి లాక్ డౌన్ విధించాలని ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై నాల్రోజుల్లో కేబినెట్ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకుంటారని తెలిసింది. రెండు వారాలు లాక్‌డౌన్ విధించే యోచనలో ఉన్నట్లు తెలిసింది. ప్రస్తుతం తెలంగాణలో కరోనా వైరస్ కేసుల సంఖ్య 14,000 దాటింది. తాజాగా 983 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే 816 కేసులొచ్చాయి. తాజాగా 244 మంది డిశ్చార్జ్ అయ్యారు. నలుగురు చనిపోయారు.

Tags :
|

Advertisement