Advertisement

  • దుర్గమ్మ గుడి సిబ్బందిలో తాజాగా మరో ఏడుగురుకు కరోనా పాజిటివ్

దుర్గమ్మ గుడి సిబ్బందిలో తాజాగా మరో ఏడుగురుకు కరోనా పాజిటివ్

By: chandrasekar Tue, 18 Aug 2020 8:44 PM

దుర్గమ్మ గుడి సిబ్బందిలో తాజాగా మరో ఏడుగురుకు కరోనా పాజిటివ్


విజయవాడలోని ప్రముఖ దేవాలయం దుర్గమ్మ గుడి సిబ్బందిని సైతం కరోనా భయం వణికిస్తోంది. ఇక్కడ సిబ్బందికి ఇప్పటికే రెండు సార్లు పరీక్షలు నిర్వహించారు. పరీక్షలు నిర్వహించిన రెండు సార్లు కేసులు నమోదయ్యాయి. కరోనా కారణంగా ఏపీలోని ఆలయాల్లో విధులు నిర్వహించే ఉద్యోగులు వణికిపోతున్నారు. ఓ వైపు భక్తులకు దర్శనాలు కొనసాగుతుండటంతో విధులు నిర్వహించక తప్పని పరిస్థితి నెలకొంది. మరోపక్క ఎక్కడ కరోనా కాటు వేస్తుందా అనే ఆందోళన వారిని వెంటాడుతోంది. ఇంతకు మునుపే ఆలయంలోని కీలక అధికారితో పాటు ఐదురుగు సిబ్బంది కరోనా బారిన పడగా తాజాగా మరో ఏడుగురుకు పాజిటివ్‌ రావడం ఇంద్రకీలాద్రిపై కలకలం రేపింది.

గతంలో ఒక వేదపడింతుడు, ఉద్యోగి కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. అయితే వారికి కరోనాతో పాటు ఇతర శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి. మిగిలిన వారు కరోనా నుంచి కోలుకున్నారు. అయితే గత వారం దుర్గగుడిలో రెండోసారి 393 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో ఏడుగురికి పాజిటివ్‌ అని తేలింది. మరికొందరి పరీక్షలకు సంబంధించిన ఫలితాలు రావాల్సి ఉంది. భక్తులు రావడంతో వారి ద్వారా సిబ్బందికి సోకి ఉండవచ్చని తెలిపారు. కానీ రాష్ట్రంలోని మిగతా ఆలయాలతో పోలిస్తే ఇక్కడ కరోనా సోకిన సిబ్బంది తక్కువగానే ఉన్నారని అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సడలించిన తరువాత ఒక్కరోజు కూడా ఆలయాన్ని మూసివేయలేదు. దీనికి రక్షణ చర్యలే కారణమని అధికారులు తెలియజేసారు. అయితే కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బందిలో మాత్రం ఆందోళన కొనసాగుతోంది. రాష్ట్రంలోని నలుమూలల నుండి భక్తులు రావడంతో వ్యాప్తి అధికమైనట్లు తెలిపారు. కట్టుదిట్ట మైన చర్యలు తీసికోకపోతే మరింతగా వ్యాపించి ఉండేదని వివరించారు.

Tags :
|
|

Advertisement