Advertisement

  • కరోనా లక్షణాలు లేనప్పటికీ ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉంటే కరోనా సోకినట్లే

కరోనా లక్షణాలు లేనప్పటికీ ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉంటే కరోనా సోకినట్లే

By: chandrasekar Thu, 15 Oct 2020 11:58 AM

కరోనా లక్షణాలు లేనప్పటికీ ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉంటే కరోనా సోకినట్లే


న్యూఢిల్లీ: కరోనా లక్షణాలు లేనప్పటికీ రక్తంలో ఆక్సిజన్‌ స్థాయిలను ప్రమాణంగా తీసుకుని ఆ మేరకు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. రక్తంలో ఆక్సిజన్‌ స్థాయి తగ్గడాన్ని వైద్య పరిభాషలో హైపోక్సియాగా వ్యవరిస్తారు. కొందరిలో కరోనా లక్షణాలు కనిపించక పోయినా ఆక్సిజన్‌ స్థాయిలు తక్కువగా ఉండటాన్ని వైద్యులు గుర్తించారు. వీరిని కూడా కరోనా సోకినట్లుగానే భావించి చికిత్స అందించాలని తెలిపారు. అశ్రద్ధ చేసిన పక్షంలో ప్రాణాలకు ముప్పుగా మారవచ్చని హెచ్చరిస్తున్నారు. హైపోక్సియాను ముందుగా గుర్తించని పక్షంలో రోగి ప్రమాదంలో పడవచ్చని పేర్కొన్నారు. సాధారణంగా బ్యాక్టీరియా, ఫంగస్, వైరస్ వల్ల ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్‌ సోకి న్యుమోనియా బారిన పడతారు.

ఈ నేపథ్యంలో కరోనా వైరస్‌ కూడా న్యుమోనియాకు దారితీస్తుందని గుర్తించారు. దీనిని కొవిడ్‌ న్యుమోనియా అని పిలుస్తున్నారు. మరోవైపు రక్తంలోని సాధారణంగా ఆక్సిజన్‌ స్థాయి 75 నుంచి 100 ఎంఎం హిమోగ్లోబిన్‌ వరకు ఉంటుంది. ఈ శాతం 95 కంటే ఎక్కువగా ఉంటే సాధారణంగా పరిగణించవచ్చు. 95 కంటే తక్కువగా ఉంటే అసాధారణంగా పరిగణిస్తారు. పల్స్‌ ఆక్సిమీటర్‌తో రక్తంలోని ఆక్సిజన్‌ స్థాయిలను గుర్తించవచ్చు. అయితే కరోనా సోకిన అందరిలో ఆక్సిజన్‌ స్థాయిలు తగ్గకపోవచ్చని వెద్యులు చెబుతున్నారు. ఊపిరితిత్తులు, గుండె, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలున్నవారు మాత్రం ఆక్సిజన్‌ స్థాయిల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Tags :
|

Advertisement