Advertisement

కరోనా బారిన పడ్డ మరో దేశ ప్రధాని...

By: chandrasekar Mon, 26 Oct 2020 7:23 PM

కరోనా బారిన పడ్డ మరో దేశ ప్రధాని...


ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తూనే ఉంది. కరోనా నియంత్రణకు నిత్యం కృషీ చేస్తున్న ఫ్రంట్ వారియర్స్ సైతం కరోనా బారిన పడుతున్నారు. ఇక సామాన్యుడి నుంచి ప్రముఖుల దాకా ఎవరిని వదలడం లేదు.

తాజాగా బల్గేరియా ప్రధాని బోయికో బోరిసోవ్ కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌, యూకే ప్రధాని బోరిస్ జాన్సన్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల ప్రధానులు, అధ్యక్షులు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

తాజాగా ఈ జాబితాలో బల్గేరియా ప్రధాని కూడా చేరారు. కరోనా సోకిన ఓ ప్రభుత్వాధికారితో సమావేశం కావడంతో బల్గేరియా ప్రధాని బోయికో కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నట్టు ఆ దేశ అధికారులు పేర్కొన్నారు. తన కార్యక్రమాలన్నిటిని వాయిదా వేసుకున్నట్టు తెలిపారు.

కాగా..ఇప్పటివరకు బల్గేరియా వ్యాప్తంగా మొత్తం 37,562 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లోనే బల్గేరియాలో 1,043 కేసులు బయటపడ్డాయి. మరోపక్క కరోనా బారిన పడి మొత్తం 1,084 మంది మృత్యువాతపడ్డారు. ఇక తనతో సన్నిహితంగా ఉన్నవారిని కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని అధ్యక్షులు బోరిసోవ్ అన్నారు.

Tags :
|

Advertisement