Advertisement

  • మహారాష్ట్రలో కరోనా తీవ్రత వారం రోజులుగా తగ్గుముఖం

మహారాష్ట్రలో కరోనా తీవ్రత వారం రోజులుగా తగ్గుముఖం

By: chandrasekar Sat, 31 Oct 2020 09:31 AM

మహారాష్ట్రలో కరోనా తీవ్రత వారం రోజులుగా తగ్గుముఖం


దేశంలో చాలా చోట్లా కరోనా తీవ్రత నెమ్మదిగా తగ్గు ముఖం పట్టింది. మహారాష్ట్రలో కరోనా వైరస్‌ వ్యాప్తి తీవ్రత గతం కంటే కాస్త తగ్గింది. వారం రోజులుగా తక్కువ సంఖ్యలో కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. గురువారం నుంచి శుక్రవారం వరకు కొత్తగా 6,190 పాజిటివ్‌ కేసులు, 127 మరణాలు నమోదయ్యాయి. దీంతో మహారాష్ట్రలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 16,72,858కు, మరణాల సంఖ్య 43,837కు చేరింది.

మహారాష్ట్రలో మరోవైపు గత 24 గంటల్లో 8,241 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో కరోనా నుంచి కోలుకున్న వారి మొత్తం సంఖ్య 15,03,050కు చేరినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం 1,25,418 యాక్టివ్‌ కరోనా కేసులు ఉన్నట్లు పేర్కొంది. కాగా, దేశంలో కరోనా కేసులు, మరణాలపరంగా మహారాష్ట్ర తొలిస్థానంలో కొనసాగుతున్నది. వాక్సిన్ వస్తే కానీ తీవ్రతను కట్టడి చేయలేము.

Tags :
|

Advertisement