Advertisement

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా...

By: chandrasekar Wed, 18 Nov 2020 1:18 PM

తెలంగాణలో మళ్లీ పెరుగుతున్న కరోనా...


తెలంగాణలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతన్నాయి. నిన్న రాత్రి 8గంటల వరకు 42,433 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 948 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,59,776కి చేరింది.

బుధవారం ఉదయం ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే కరోనాతో ఐదుగురు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,415కి చేరింది. కరోనా నుంచి నిన్న 1,607 మంది కోలుకున్నారు.

దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 2,45,293కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 13,068 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 10,710 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ పేర్కొంది. ఇప్పటి వరకు తెలంగాణలో నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 49,72,407కి చేరింది.

ఇక రాష్ట్రంలో మరణాల రేటు 0.54 శాతం ఉండగా, ఇదే దేశంలో 1.5 ఉంది. రికవరీ రేటు రాష్ట్రంలో 94.42 శాతం ఉండగా, దేశంలో 93,5 శాతం ఉంది. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 154 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

Tags :
|
|

Advertisement