Advertisement

ప్రముఖ సింగర్స్ సునీత, మాళవికకు కరోనా ...

By: chandrasekar Tue, 18 Aug 2020 9:08 PM

ప్రముఖ సింగర్స్ సునీత, మాళవికకు  కరోనా ...


సినీ ఇండస్ట్రీలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉందనే చెప్పవచ్చు. షూటింగ్‌ల్లో పాల్గొనేవాళ్లు, కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. ఈ తరహాలో డైరెక్టర్ రాజమౌళి, తేజ, బండ్ల గణేష్‌, డివివి దానయ్య, నాగవంశీ వంటి ప్రముఖులకు కూడా కరోనా పాజిటివ్ నిర్థారణ అయిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరో ఇద్దరు సింగర్లకు కరోనా పాజిటివ్ అని తేలింది.ఓ టీవీ ఛానల్‌లో ప్రసారమయ్యే సంగీత కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ సింగర్స్‌ సునీత, మాళవికాలు కరోనా బారిన పడ్డారు. ఇటీవల వీరికి కరోనా పాజిటివ్ అని నిర్థారణ అయింది. ఆ కార్యక్రమంలోనే కరోనా సోకిందని వర్గాల సమాచారం. ఎందుకంటే ప్రోగ్రామ్‌లో పాల్గొన్న చాలామందికి కరోనా వచ్చినట్లు సమాచారము.

Tags :
|
|
|

Advertisement