Advertisement

అమెరికాలో గత 4 నెలల్లో 3,39,000 మంది పిల్లలకు కరోనా

By: chandrasekar Wed, 12 Aug 2020 10:57 AM

అమెరికాలో గత 4 నెలల్లో 3,39,000 మంది పిల్లలకు కరోనా


కరోనావైరస్ విజృంభణకు అడ్డు కట్టలు పడటం లేదు సరికదా మరింత విజృంభిస్తోంది. జూలై 16 నుంచి 30 వరకు అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో 97 వేల మంది పిల్లలకు కరోనావైరస్ సోకినట్టు అమెరికన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చిల్డ్రెన్స్ హాస్పిటల్స్ అసోసియేషన్ వెల్లడించింది. కరోనావైరస్ వ్యాపించడం మొదలైన తొలినాళ్లలో చిన్నారులకు కరోనా సోకే అవకాశాలు తక్కువే అని పలు అధ్యయనాల్లో తేలినప్పటికీ అమెరికాలో గత 4 నెలల్లో 3,39,000 మంది పిల్లలు కరోనావైరస్ బారినపడిన తీరు మాత్రం ఆందోళన పరుస్తోంది.

ఒక్క జూలై నెలలోనే 30 మంది పిల్లలు కరోనా కారణంగా మరణించడం చిన్నారుల తల్లిదండ్రులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. చిన్నారులకు కరోనా సోకుతున్న కేసులు అధికమవుతుండటంపై డా సీన్ ఓ లియరి అనే పీడియాట్రిక్ ఇన్‌ఫెక్షియస్ స్పెషలిస్ట్ మాట్లాడుతూ.. అమెరికాలో ప్రస్తుత పరిస్థితులు చూస్తోంటే.. చిన్నారులకు కరోనా సోకే అవకాశాలు అధికంగానే ఉన్నాయనే విషయం స్పష్టమవుతోందని అన్నారు. అలాగే ఆ వైరస్ వారి నుంచి ఇతరులకు వ్యాపించే అవకాశాలు కూడా అంతే ఉన్నాయని డా సీన్ అభిప్రాయం వ్యక్తం చేశారు.

Tags :
|

Advertisement