Advertisement

  • రైల్వే సిబ్బంది 30 మందికి కరోనా... సికింద్రాబాద్‌ రైల్ నిలయానికి మూత...

రైల్వే సిబ్బంది 30 మందికి కరోనా... సికింద్రాబాద్‌ రైల్ నిలయానికి మూత...

By: chandrasekar Tue, 15 Sept 2020 09:52 AM

రైల్వే సిబ్బంది 30 మందికి కరోనా... సికింద్రాబాద్‌ రైల్ నిలయానికి మూత...


రైల్వే సిబ్బంది 30 మందికి కరోనా వైరస్ వ్యాప్తిచెందడంతో సికింద్రాబాద్‌ రైల్ నిలయానికి మూత పడింది. సికింద్రాబాద్‌ రైల్ నిలయంలో కరోనా వైరస్‌ కలకలం రేపింది. 30 మంది ఉద్యోగులకు కరోనా సోకింది. రైల్‌ నిలయంలో వివిధ విభాగాల్లో పనిచేసే దాదాపు 2500 మంది సిబ్బందికి కొవిడ్‌ టెస్ట్‌లు నిర్వహించారు. దీంతో వారిలో 30 మందికి పాజిటివ్‌ వచ్చినట్టు నిర్ధారణ అయింది. దీంతో రెండు రోజుల పాటు రైల్‌ నిలయం మూసివేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

ఎక్కువ మంది జనాలు నిత్యం గుమి కూడడంతో భవనాన్ని శానిటైజ్‌ చేయనున్నట్టు రైల్వే సీపీఆర్వో రాకేశ్ తెలిపారు. లిఫ్టులు, టాయిలెట్స్, అందరూ తిరిగే ప్రాంతాల్ని శానిటైజ్ చేయనున్నారు. తిరిగి బుధవారం కార్యకలాపాలు ప్రారంభమవుతాయన్నారు. కరోనా వైరస్‌ సోకిన వారిలో చాలా మందిలో లక్షణాలు లేనట్టు తెలిపారు. తగినన్ని జాగ్రత్త చర్యలు చేపట్టిన తరువాత ప్రజల అందుబాటులోకి రానుంది.

తెలంగాణ రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులు తాజాగా కాస్త తగ్గుముఖం పట్టాయి. నిత్యం రెండువేలు దాటి నమోదవుతున్న కేసులు సోమవారం మాత్రం 1417 కేసులు మాత్రమే రికార్డ్ అయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 264 మందికి కొత్తగా కరోనా సోకింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ప్రకటన విడుదల చేసింది. నిన్న ఒక్కరోజే వైరస్‌ బారిన పడిన 13 మంది ప్రాణాలు కోల్పోగా ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 974కి చేరింది. మరోవైపు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,58,153కి చేరింది. అన్ లాక్ వల్ల మరింత గా ప్రబలుతున్నట్లు తెస్తుంది.

Tags :
|
|

Advertisement