Advertisement

పాకిస్తాన్ జట్టు లో 10 మందికి కరోనా

By: chandrasekar Wed, 24 June 2020 12:37 PM

పాకిస్తాన్ జట్టు లో 10 మందికి కరోనా


పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై కరోనా వైరస్ పంజా విసురుతోంది. ఆటగాళ్లంతా వరుసగా కోవిడ్ బారినపడుతున్నారు. సోమవారం ముగ్గురు కరోనా బారినపడగా.. తాజాగా మరో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చిందని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ (PCB) అధికారికంగా ప్రకటించింది. నిన్న హైదర్ అలీ, హారిస్ రవుఫ్, షాదబ్ ఖాన్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది.

ఇక ఇవాళ ఫకార్ జమాన్, ఇమ్రాన్ ఖాన్, కషీఫ్ భట్టి, మహమ్మద్ హఫీజ్, మహమ్మద్ హస్నేన్, మహమ్మద్ రిజ్వాన్, వాహబ్ రియాజ్‌కు కూడా కరోనా బారినపడినట్లు నిర్ధారణ అయింది.

కరోనా సోకిన పాకిస్తానీ క్రికెటర్లలో ఎలాంటి కరోనా లక్షణాలు లేవు. త్వరలోనే ఇంగ్లండ్ టూర్‌కు వెళ్లనున్న నేపథ్యంలో జట్టు ఆటగాళ్లకు కరోనా పరీక్షలు చేసింది పీసీబీ.

ఈ పరీక్షల్లో ఇప్పటి వరకు 10 మంది ఆటగాళ్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. అప్రమత్తమైన పీసీబీ అధికారులు వారితో సన్నిహితంగా మెలిగిన వివరాలు సేకరిస్తున్నారు. కాగా, పాకిస్తాన్ మాజీ క్రికెట్ షాపిద్ అఫ్రిది ఇప్పటికే కరోనా బారినపడిన విషయం తెలిసిందే.

పాకిస్తాన్‌లో ఇప్పటి వరకు 185,034 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీరిలో కరోనా మహమ్మారితో పోరాడుతూ 73,471 మంది కోలుకొని డిశ్చార్జి కాగా 3,946 మంది మరణించారు. ప్రస్తుతం పాకిస్తాన్‌లో 107,868 కరోనా యాక్టివ్ కేసులున్నాయి.

Tags :
|
|
|

Advertisement