Advertisement

  • కరోనా వైరస్ కన్నా ఆ భయమే ఎక్కువ ప్రాణాలు తీస్తుంది ..

కరోనా వైరస్ కన్నా ఆ భయమే ఎక్కువ ప్రాణాలు తీస్తుంది ..

By: Sankar Tue, 04 Aug 2020 7:29 PM

కరోనా వైరస్ కన్నా ఆ భయమే ఎక్కువ ప్రాణాలు తీస్తుంది ..



కరోనా వైరస్సే కాదు.. దానిపై భయం కూడా మనుషులను వెంటాడుతున్నది. ఆ మహమ్మారి కంటే ముందే భయం అనే వ్యాధి చంపేస్తున్నది. యు వకులు, వృద్ధులు అన్న తేడా లేకుండా వారి గుండెలయను ఆపేస్తున్నది. కొందరు కరోనా సోకినవాళ్లు, సోకిందేమోనన్న అనుమానం ఉన్నవాళ్లు క్షణమొక యుగంలా, దినదిన గండంలా బతుకీడుస్తున్నారు. ఈ భయాన్నే వైద్య పరిభాషలో ‘అగోరాఫోబియా’ అంటారు.

కరోనా నుంచి కోలుకోవాల్సిన వాళ్లు కూడా తీవ్ర మానసిక ఆందోళనకు గురై ప్రాణాల మీద కు తెచ్చుకుంటున్నారు. ఇటీవల కాలంలో సైకాలజిస్టుల దగ్గరికి వచ్చే ప్రతి పదిమందిలో ఆరేడుగురు కరోనాతో ముడిపడి ఉన్నవారేనట. ‘నేను బతుకుతానా? రోగానికి మందు లేదట కదా? నేను పోతే నా కుటుంబపరిస్థితి ఏంటి?’ అనే ప్రశ్నలు వాళ్ల మెదళ్లను తొలుస్తున్నాయట. భయం పాముకాటు మాదిరేనని సైకాలజిస్టులు చెప్పారు.

పాముకాటేయగానే, విష ప్రభావం కంటే ముందు.. చనిపోతామేమోనన్న భయం తో గుండెపోటు వచ్చి చనిపోయినవాళ్లే ఎక్కువగా ఉంటారని వివరించారు. అలాగే, వైద్యులు కరోనాకు చికిత్స అందిస్తున్నా బాధితుడిలో మానసిక ఆందోళన ఎక్కువై, అది గుండెపై ప్రభావం చూపుతున్నదని వెల్లడించారు.

కడప జర్నలిస్టు విషయంలోనూ ఇదే కనిపించింది. వెంటిలేటర్‌ ద్వారా ఆక్సిజన్‌ అందిస్తున్నా తన కు ఊపిరి ఆడటం లేదని చెప్పడం విపరీతమైన మానసిక ఆందోళనేనని విశ్లేషించారు. ఇక కరో నా సోకుతుందేమోననే భయంతో దేశవ్యాప్తం గా అనేక మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. నమ్ముకున్న కుటుంబాలను నట్టేట ముంచి అనవసరంగా ప్రాణాలు విడుస్తున్నారు.

Tags :
|
|
|
|

Advertisement