Advertisement

కరోనా భయం…తుపాకులను సైతం శానిటైజ్

By: chandrasekar Sat, 25 July 2020 1:50 PM

కరోనా భయం…తుపాకులను సైతం శానిటైజ్


మూడు అంగుళాల బుల్లెట్ ఎంత పవర్‌పుల్లో తెలుసుకదా మరి తూటాను విడుదల చేసే తుపాకికి ఎంత పవర్ ఉంటుందో తెలుసా మరి అటువంటిది అది పోలీస్‌లు వాడే తుపాకీ అయితే ఇంకా చెప్పాలా మరి అటువంటి తుపాకీ కూడా కరోనావైరస్ భయం పట్టుకుంది. మనుషులకే కాదు ఆయుధాలను కూడా కరోనా భయం వెంటాడుతుందంట. అందువల్ల ఆ తుపాకులు కూడా ఇప్పుడు శానిటైజ్ చేసుకోవాల్సి వస్తోంది. మరి అంత భద్రత చేయకపోతే మన ప్రాణాల మీదకే ముప్పు ఏర్పడుతుంది. అందువల్లనే తుపాకులను సైతం శానిటైజ్ చేస్తున్నారు భద్రాద్రి జిల్లా పోలీసులు. కరోనా పాజిటివ్ వచ్చిందంటే చాలు బతికి బయట పడుతామన్న నమ్మకం లేదు.

ఛత్తీస్‌ఘడ్, తెలంగాణా సరిహద్దు జిల్లాల ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలు కనిపించడంతో గాలింపు చర్యలు ఉదృతం చేశారు ఇరు రాష్ట్రాల పోలీసులు. ఇప్పటికే ఛత్తీస్‌ఘడ్‌కు చెందిన సి.ఆర్.పి.ఎఫ్ జవానులకు కరోనా సోకింది. చర్ల సరిహద్దులో ఉన్న సి.ఆర్.పి.ఎఫ్ ప్లాటూన్ అరవై మందికి పైగా కానిస్టేబుళ్లకు కరోనా పాజిటివ్‌గా తేలండంతో వారిని క్వారంటైన్‌కు తరలించారు.

వీరితో కలిసి తెలంగాణ పోలీసులు కూడా కూంబింగ్‌లో పాల్గొనడంతో తెలంగాణకు చెందిన ఇరవై మందిలో పాజిటివ్ కేసులు వచ్చాయి. దీంతో కూంబింగ్‌లో వాడిన ఆయుధాలతో పాటు, పోలీసులు మోసుకు వచ్చిన తుపాకులను కూడా హెడ్ క్వార్టర్లో శానిటైజ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అక్కడ ఎవ్వరికైనా కానిస్టేబుళ్లకు కరోనా వైరస్ అంటుకుంటే వారి వల్ల తుపాకులకు కూడా అంటుకుంటుంది. ఇనుము మీద కరోనావైరస్ ఎక్కువసేపు ఉంటుందని ఇప్పటికే వైద్య అధికారులు చెబుతున్నారు. అందువల్ల ముందు జాగ్రత్తగా తుపాకులకు కూడ శానిటైజ్ చేస్తున్నారు అధికారులు. దీంతో ఈ తుపాకులను మళ్లీ మరో బృందానికి ఇచ్చి కూంబింగ్‌కు పంపింస్తారు.

Tags :
|
|
|

Advertisement