Advertisement

లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ లో కరోనా మహమ్మారి

By: chandrasekar Wed, 27 May 2020 6:23 PM

లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ లో కరోనా మహమ్మారి


ప్రముఖ నటుడు, డ్యాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ నిర్వహిస్తున్న చారిటబుల్ ట్రస్ట్ లో కరోనా మహమ్మారి కలకలం రేపింది. చెన్నైలోని అశోక్ నగర్ లో ట్రస్ట్ ఉండగా, ఇక్కడ ఎంతో మంది ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పుడు ట్రస్ట్ లో ఉన్నవారిలో 21 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

లారెన్స్ నిర్వహిస్తున్న ఈ ఫౌండేషన్ లో 18 మంది పిలల్లకి, ముగ్గురు ఉద్యోగులకి కరోనా సోకినట్టు రిపోర్ట్స్‌లో తేలింది. 21 మందికి కరోనావైరస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్టు ఫౌండేషన్ వర్గాలు చెబుతున్నాయి. కరోనా సోకిన వారిని చెన్నైలోని లయోలా కాలేజీలోని వైద్య శిబిరానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితులందరూ ఆరోగ్యంగా ఉన్నారని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.

corona,epidemic,lawrence,charitable,trust ,లారెన్స్, చారిటబుల్, ట్రస్ట్ లో, కరోనా, మహమ్మారి


ట్రస్ట్ లోని సభ్యులందరికి కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. లారెన్స్ కొద్ది రోజులుగా అనాథలు, వికలాంగుల కోసం స్థానిక అశోక్‌నగర్‌లో ట్రస్ట్‌ ద్వారా అనాథాశ్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. చెన్నైలో వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో. కరోనా నిరోధక చర్యల్లో భాగంగా చెన్నై కార్పొరేషన్ సిబ్బంది ఇంటింటి సర్వే నిర్వహించారు.

ఈ క్రమంలో లారెన్స్ చారిటబుల్ ట్రస్ట్ లో ఉన్న పలువురిలో కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వారి నమూనాలు సేకరించి పరీక్షించగా, 20 మందికి పాజిటివ్ వచ్చింది. ఆ వెంటనే వారందరినీ ఆసుపత్రికి తరలించామని వెల్లడించిన గ్రేటర్ చెన్నై అధికారులు, ట్రస్ట్ గెస్ట్ హౌస్ ను మూసివేశారు. ఆ ప్రాంతంలో శానిటైజ్ నిర్వమించారు. ట్రస్ట్ హౌన్ ఉన్న ప్రాంతాన్ని కంటైన్ మెంట్ జోన్ గా ప్రకటించారు.

Tags :
|

Advertisement