Advertisement

  • హైదరాబాదులో ప్రమాదకరమైన స్థాయిలో కరోనా విస్తరణ

హైదరాబాదులో ప్రమాదకరమైన స్థాయిలో కరోనా విస్తరణ

By: chandrasekar Fri, 05 June 2020 12:15 PM

హైదరాబాదులో ప్రమాదకరమైన స్థాయిలో కరోనా విస్తరణ


మనం ఎంత భయంతో ఉన్నామో దానికి రెట్టింపు భయం, జాగ్రత్తలతో గడపాల్సిన పరిస్థితి ప్రస్తుతం హైదరాబాదులో ఉంది. ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన శాతంలో కరోనా హైదరాబాదు నగరంలో విస్తరించినట్లు ఒక అంచనా. లాక్ డౌన్లో ఉన్నపుడు రెడ్ జోన్ల వారికే కరోనా సోకే ప్రమాదం ఉండేది. కానీ ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. సడలింపులతో హైదరాబాదీయులు అన్ని ప్రాంతాలకు తిరుగుతున్నారు. దీంతో ఎక్కడైనా కేసులు బయటపడే ప్రమాదం, అవకాశం ఇపుడు ఉంది. అందుకే మునుపటి కంటే ఇపుడే మనం ఎక్కువ డేంజర్లో ఉన్నాం. ప్రజలు నిత్యం దీనిని గుర్తుపెట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది.

హైదరాబాదులో కరోనా వ్యాప్తి విషయంలో గణాంకాలు కూడా ఇదే చెప్తున్నాయి. లాక్ డౌన్ తర్వాత జిల్లాల్లో మళ్లీ కేసులు ఎలాగైతే వచ్చాయో అదే సూత్రం హైదరాబాదుకు వర్తిస్తుంది. జీహెచ్ఎంసీ పరిధిలో లెక్కకు మిక్కిలిగా కేసులు నమోదవుతున్నాయి. సడలింపులే దీనికి ప్రధాన కారణం అని తెలిసిన విషయమే. వంద మందికి టెస్టులు చేస్తే పది మందికి కరోనా ఉంటోంది. ప్రస్తుతం తెలంగాణలో సెకండరీ కాంటాక్టులకు లక్షణాలు ఉంటే తప్ప టెస్టులు చేయడం లేదు. తొలుత చాలా సీరియస్ గా తీసుకున్న తెలంగాణ సర్కారు ఇపుడు టెస్టుల విషయంలో తాపీగా వ్యవహరిస్తోంది.

corona,enlargement,dangerous,level,hyderabad ,హైదరాబాదులో, ప్రమాదకరమైన, స్థాయిలో, కరోనా, విస్తరణ


80 శాతం మందిలో లక్షణాలు కనిపించకపోవడం మనకు అతిపెద్ద ప్రమాదం. ఎవరి ద్వారా సోకుతుందో, ఎవరు రోగియో, ఎవరు సాధారణ వ్యక్తియో తెలియడం లేదు. కరోనా ముందులాగే అందరూ యథేచ్ఛగా తిరుగుతున్నారు. మాస్క్ వేసుకోవడం, శానిటైజర్ వెంట పెట్టుకోవడం, ఇతరులకు దూరంగా ఉండి మాట్లాడటం ద్వారా మాత్రమే మనం బయటపడగలం. అత్యవసరం అయితే తప్ప ఇతరులను కలవకపోవడం మంచిది.

హైదరాబాదులో అందరికీ టెస్టులు చేస్తే కనీసం లక్ష కేసులు బయటపడినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇమ్యునిటీ ఉన్నవారికి ఇది రావడం, పోవడం కూడా తెలియడం. లేదంటున్నారు. కానీ వారిలో కరోనా ఉన్న సమయంలో కొందరికి అంటిస్తున్నారు. అందుకే ఎవరికి వారు ఇతరులకు దూరంగా ఉండటం ద్వారానే తమను తాము రక్షించుకోగలరు. హైదరాబాదులో 31 మంది డాక్టర్లకు కరోనా సోకింది. ఇద్దరు ల్యాబ్ టెక్నీషియన్లకు కూడా సోకింది. దీనిని బట్టి పరిస్థితిని అంచనా వేసుకోవచ్చు.

Tags :
|
|

Advertisement