Advertisement

సందిగ్ధంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు

By: Sankar Tue, 23 June 2020 10:04 AM

సందిగ్ధంలో అమెరికా అధ్యక్ష ఎన్నికలు



అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు రంగం సిద్ధం కాబోతుంది ..ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి అమెరికా లో ఎన్నికలు జరుగుతాయి..క్రితం సారి 2016 లో జరిగిన ఎన్నికల్లో డోనాల్డ్ ట్రంప్ ఘన విజయం సాధించాడు ..ఈ నాలుగేళ్లలో తన దుందుడుకు స్వభావంతో అనేక సార్లు వార్తల్లో నిలిచాడు ..అయితే ఈసారి కరోనా కారణంగా అమెరికా అతలాకుతలం అవుతుంది ..ప్రపంచంలోనే అత్యధిక కేసులతో , అత్యధిక మరణాలతో తీవ్ర సంక్షోభంలో ఉంది ..మరోవైపు నల్ల జాతీయుల నిరసనలు ..ఇలా ఇన్ని ఆటంకాల మధ్య ఇంకో నాలుగు నెలల్లో జరిగే అధ్యక్ష ఎన్నికలు సజావుగా జరుగుతాయా అంటే చెప్పడం కష్టమే ..ఇదే జరిగితే అమెరికా చరిత్రలో తొలి సారి అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడే అవకాశం ఉంది ..

corona,effects,united states,president,elections,trump ,సందిగ్ధంలో ,  అమెరికా ,అధ్యక్ష ,ఎన్నికలు ,డోనాల్డ్ ట్రంప్



అయితే అమెరికాలో ఏ ఎన్నికలైనా వాయిదా వేసుకోవచ్చు. కానీ అధ్యక్ష ఎన్నికలకు ఆ అవకాశం లేదు. ఆ దేశ రాజ్యాంగంలో అధ్యక్ష ఎన్నిక తేదీని అమెరికా స్పష్టంగా నిర్దేశించింది. అధ్యక్షుడు పదవీ బాధ్యతలు స్పీకరించిన చేసిన నాలుగేళ్ళ తర్వాత వచ్చే నవంబరులో తొలి సోమవారం తర్వాతి మంగళవారంనాడు కొత్త అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకొనే ఎలక్టోరల్‌ కాలేజీకి ఎన్నికలు జరగాలి అని రాజ్యాంగం చెబుతోంది. ఈ తేదీని మార్చాలంటే రాజ్యాంగాన్ని సవరించాలి. ఒకవేళ ట్రంప్‌ అందుకు సిద్ధమైనా... ప్రస్తుతం డెమొక్రాట్లు ఆధిక్యంలో ఉన్న అమెరికా ప్రతినిధుల సభ అందుకు అంగీకరిస్తుందా అనేది ఆసక్తికరమైన అంశం. నాలుగు నెలల తర్వాత దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉంటుందన్నదానిపైనే అధ్యక్ష ఎన్నికలు సకాలంలో జరుగుతాయా లేదా అనేది తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ రాజ్యాంగ సవరణ అంటూ జరిగితే అది సంచలనమే అవుతుంది. కాగా ప్రపంచ యుద్ధాలు లాంటి గడ్డు పరిస్థితులను నేరుగా ఎదుర్కొన్న అమెరికాలో ఇప్పటి వరకు అధ్యక్ష ఎన్నికలు వాయిదా పడలేదు. కాగా రిపబ్లిక్‌ పార్టీ తరఫున ట్రంప్‌ మరోసారి బరిలోకి దిగుతుండగా.. డెమొక‍్రటిక్‌ పార్టీ నుంచి జో బిడెన్‌ అభ్యర్థిత్వం దాదాపు ఖరారైనట్లే.

మరి ఇలాంటి నేపథ్యంలో డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సహాయకులు చేస్తున్న వ్యాఖ్యలు అధ్యక్ష ఎన్నికలపై పలు అనుమానాలను, ఆసక్తిని పెంచుతున్నాయి. ప్రజలంతా బయటకు వచ్చి పోలింగ్‌ బూత్‌ల ద్వారా ఓటు హక్కును వినియోగించుకుంటేనే ఎన్నికలు సజావుగా సాగే అవకాశం ఉందని, ఈ-మెయిల్‌ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడే అవకాశం ఉందంటూ ట్రంప్‌ ఇటీవల వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతమున్న కరోనా కాలంలో ఓటర్లు బయటకు వచ్చి ఓటేసే పరిస్థితి లేదు. ఇక ఈ మెయిల్‌ ఓటింగ్‌కు ట్రంప్‌ విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అధ్యక్షుడికి ఉన్న అధికారాలతో ఎన్నికలు కొంత కాలంపాటు వాయిదా వేసే అవకాశం ఉందటూ రిపబ్లిక్‌ పార్టీ ప్రతినిధులు చెబుతున్నారు. మరోవైపు ట్రంప్‌ ఇప్పటికే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించడం గమనార్హం


Tags :
|

Advertisement