Advertisement

  • ఎయిరిండియా సిబ్బందికి కరోనా ఎఫెక్ట్...వేతనాల్లో కోత

ఎయిరిండియా సిబ్బందికి కరోనా ఎఫెక్ట్...వేతనాల్లో కోత

By: chandrasekar Thu, 23 July 2020 11:06 AM

ఎయిరిండియా సిబ్బందికి కరోనా ఎఫెక్ట్...వేతనాల్లో కోత


కరోనా సంక్షోభం నేపథ్యంలో ఆ సంస్థ పైలట్ల వేతనాన్ని 40 శాతం తగ్గిస్తున్నట్లు ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా ప్రకటించింది. ఇతర అలవెన్సులు కలుపుకొని 85 శాతం వరకు నష్ట పోతున్నట్లు పైలట్లు వాపోతున్నారు. 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు ఎయిరిండియా తమ సిబ్బందికి బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది.

పైలట్లతో పాటు క్రూ సిబ్బందిపై ఈ నిర్ణయం ప్రభావం చూపనుంది. విమానయాన మంత్రిత్వ శాఖ నిర్దేశాల మేరకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని ఎయిరిండియా పేర్కొంది. రూ.25 వేల గ్రాస్ శాలరీ ఉన్న ఉద్యోగులకు ఈ నిర్ణయం వర్తించదని స్పష్టం చేసింది. 11 రకాల అలవెన్సుల్లో కోత పెట్టినట్లు పైలట్లు చెబుతున్నారు. ఫ్లైయింగ్ అలవెన్స్, స్పెషల్ పే, వైడ్ బాడీ అలవెన్స్, చెక్ అలవెన్స్, ఎగ్జామినర్ అలవెన్స్‌లలో 40 వరకు కోత విధించినట్లు తెలిపారు.

అంతేకాకుండా ఇకపై ఫ్లైయింగ్ అలవెన్స్‌ను గంటల లెక్క ప్రకారం చెల్లించనున్నట్లు వెల్లడించారు. గ్రాస్ శాలరీలో తేడా వల్ల తాము భారీగా నష్ట పోతున్నామని తమకు న్యాయం చేయాలని ఎయిరిండియా సంస్థను పైలట్లు కోరుతున్నారు. కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌ కారణంగా అనేక రంగాలు కుదేలయ్యాయి.

విమానయాన రంగంపై ఈ ప్రభావం అధికంగా ఉంది. అయితే వందే భారత్ మిషన్ ద్వారా ఎయిరిండియా కొత్త నష్టాన్ని పూడ్చుకోగలిగింది. ఇతర సంస్థలకు ఆ అవకాశం కూడా లేదు. లాక్‌డౌన్‌తో కుదేలైన ఇండిగో సంస్థ తన సిబ్బందిలో 10 శాతం మందిని తొలగించింది. పలు రంగాల్లో ఉద్యోగులు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.

Tags :
|
|
|

Advertisement