Advertisement

  • ఇదీ ప్రేమంటే ...ఆకలితో అలమటిస్తున్నా... కష్టకాలంలోనూ వీడని మమకారం

ఇదీ ప్రేమంటే ...ఆకలితో అలమటిస్తున్నా... కష్టకాలంలోనూ వీడని మమకారం

By: Dimple Mon, 07 Sept 2020 08:53 AM

ఇదీ ప్రేమంటే ...ఆకలితో అలమటిస్తున్నా... కష్టకాలంలోనూ వీడని మమకారం

ఇదీ ప్రేమంటే ...ఆకలితో అలమటిస్తున్నా... కష్టకాలంలోనూ వీడని మమకారం
కరోనా కాలం...
ఏడు పదుల వయసులో సముద్రమంత కష్టం ఆకాశమంత ఆవేదన జానెడు కడుపులో దాచుకున్నారు..!!
పిడికెడు మెతుకులు పెట్టే బెత్తెడు నీడను కల్పించే మనసున్న చేతుల కోసం ఒళ్లంతా కళ్లు చేసుకుని ఆశగా ఎదరుచుస్తున్నారు..!! వారు ఎవరు..? ఎక్కడ..? ఆ విశేషాలపై కథనం
పేర్లు తుకాణం (70), అంజమ్మ (65). ఆయనది చెన్నై..ఆమెది నెల్లూరు. వారిది ప్రేమ వివాహం. నెల్లూరు శివారులో కౌలుకు పొలం తీసుకుని వ్యవసాయం చేస్తుండేవారు. అందరిలా బాగా బతుకుతూనే తమకు ఉన్నంతలో పది మందికి సాయం చేస్తుండేవారు. కాలం కలిసి రాక వ్యవసాయం ‘వ్యయ’సాయంగా మారింది. దీంతో పూలమ్మిన చోట కట్టెలమ్మలేక పొట్టచేత పట్టుకుని కృష్ణా జిల్లా హనుమాన్‌ జంక్షన్‌కు వలస వచ్చారు. వీరికి సంతానం లేరు. స్థానికంగా ఉన్న పోరంబోకు స్థలంలో ఓ పూరిపాక ఏర్పాటు చేసుకుని జీవితం ప్రారంభించారు.
అయితే ఆ స్థలంపై రాజకీయ నాయకుల కళ్లుపడి అక్కడ నుంచి వారిని ఖాళీ చేయించారు. అదే సమయంలో అంజమ్మను అనారోగ్యం వెంటాడింది. వైద్యం చేయించుకునే శక్తి లేకపోవడంతో ఆమెకు మతిస్థిమితం లేకుండా పోయింది. అప్పటి నుంచి వారు ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి దొరకని దుస్థితికి వచ్చారు. బాపులపాడు మహాత్మాగాంధీనగర్‌లో వాటర్‌ ప్లాంట్‌ ప్రాంగణమే వారికి దిక్కైంది.
ఎండకు ఎండుతూ...వానకు తడుస్తూ..చలికి వణుకుతూ ఆరుబయటే కాలం గడుపుతున్నారు. ఆయనకు పని దొరికి ఎంతో కొంత డబ్బు చేతికొస్తే ఏ హోటల్లోనో భోజనం కొనుక్కుని ఆమె ఆకలి తీర్చడం.. ఆయన తినడం, లేకుంటే ఎవరైనా దయతలచి నాలుగు మెతుకులు పెడితే కడుపు నింపుకోవడం చేస్తూ కాలాన్ని వెళ్లదీస్తున్నారు.

Tags :
|
|
|
|

Advertisement