Advertisement

  • 30 నిమిషాల్లో కరోనా నిర్ధారణ ఫలితాలు : ఐసీఎంఆర్ వెల్లడి

30 నిమిషాల్లో కరోనా నిర్ధారణ ఫలితాలు : ఐసీఎంఆర్ వెల్లడి

By: chandrasekar Tue, 16 June 2020 11:56 AM

30 నిమిషాల్లో కరోనా నిర్ధారణ ఫలితాలు : ఐసీఎంఆర్ వెల్లడి


కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో టెస్ట్‌ల సంఖ్య మరింత పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కరోనా పరీక్షలను విస్తృతంగా చేయాలని అన్ని రాష్ట్రాలకు సూచించింది. ఈ నేపథ్యంలో కరోనా పరీక్షలను వేగవంతం చేసే దిశగా కొత్త రకం కరోనా టెస్ట్‌లకు భారత వైద్య పరిశోధనా మండలి ఆమోద ముద్రవేసింది. యాంటి జెన్ (ప్రతి జనకం) ఆధారితంగా పనిచేసే ఈ టెస్ట్ కిట్‌తో కేవలం 30 నిమిషాల్లోనే తెలుసుకోవచ్చు. దీని ద్వారా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలోనే కరోనా పరీక్షలు చేయవచ్చని ఐసీఎంఆర్ వెల్లడించింది.

కరోనా పరీక్షల కోసం స్టాండర్డ్ క్యూ కోవిడ్ 19 ఏజీ డిటెక్షన్ కిట్‌‌'ను వినియోగించవచ్చని తాజా అడ్వైజరీలో సూచించింది. ఈ టెస్ట్ కిట్‌ను దక్షిణ కొరియాకు చెందిన ఎస్డీ బయ్ సెన్సార్ అనే కంపెనీ డెవలప్ చేసింది. గుర్గావ్‌లోని యూనిట్ ద్వారా వీటిని ఉత్పత్తి చేస్తోంది. కరోనా నిర్ధారణకు రియల్ టైమ్ పాలిమెరేజ్ చైన్ రియాక్షన్ విధానంలో పరీక్షలు చేస్తున్నారు. దీనికి 2 నుంచి 3 గంటల సమయం పడుతుంది. అంతేకాదు ఒక్కో RT-PCR ధర రూ.2500.


corona,diagnosis,results,in 30 minutes,icmr reveals ,30 నిమిషాల్లో, కరోనా, నిర్ధారణ ఫలితాలు, ఐసీఎంఆర్, వెల్లడి


ఈ విధానంలో పరీక్షలు చేయాలంటే శాంపిల్స్‌ను ప్రత్యేకమైన ద్రావణంలో నిల్వ చేయడంతో పాటు ప్రత్యేకమైన కిట్‌లో రవాణా చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా ఖర్చు మరింత పెరుగుతుంది. అదే స్టాండర్డ్ క్యూ కోవిడ్ 19 ఏజీ డిటెక్షన్ కిట్‌‌ రూ.500 మాత్రమే లభిస్తుంది. ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ల్యాబ్లోనే కాకుండా క్షేత్రస్థాయిలోనూ పరీక్షలు చేయవచ్చు. కరోనా నెగెటివ్ కేసుల్లో ఈ కిట్ స్పెసిఫిసిటీ రేటు 99.3-100 శాతంగా ఉంటుంది.

ఎవరిలోనైన కరోనా లేకుంటే 99.3-100శాతం ఖచ్చితత్వంతో రిపోర్టు వస్తుంది. ఇక పాజిటివ్ కేసుల విషయంలో వైరల్ లోడ్ ఆధారంగా 50-84 శాతం సెన్సిటివిటీ రేటు ఉటుందని ఐసీఎంఆర్ వెల్లడించింది. ప్రస్తుతం మనదేశంలో రోజుకు లక్షా 50వేల పరీక్షలు చేస్తున్నారు. ఈ కిట్లను వాడడం మొదలు పెడితే టెస్ట్‌ల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.

Tags :
|

Advertisement