Advertisement

  • దేశంలో లక్ష దాటిన కరోనా మరణాలు... 64 లక్షలు దాటినా కరోనా కేసులు..,

దేశంలో లక్ష దాటిన కరోనా మరణాలు... 64 లక్షలు దాటినా కరోనా కేసులు..,

By: chandrasekar Sat, 03 Oct 2020 6:36 PM

దేశంలో లక్ష దాటిన కరోనా మరణాలు...  64 లక్షలు దాటినా కరోనా కేసులు..,


ఎక్కువ జనాభా కలిగిన మన దేశంలో అన్ లాక్ ప్రకటించిన తరువాత కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. భారత్‌లో కరోనావైరస్ విలయతాండవం కొనసాగుతూనే ఉంది. దేశంలో గత కొన్నిరోజుల నుంచి నిత్యం 80 వేలకుపైగా కేసులు, 1100కి పైగా మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో తాజాగా కరోనా మహమ్మారి బారిన మరణించిన వారి సంఖ్య లక్ష మార్క్ దాటగా కేసుల సంఖ్య 64లక్షలు దాటింది. అయితే గత 24గంటల్లో శుక్రవారం, అక్టోబరు 2న దేశవ్యాప్తంగా కొత్తగా 79,476 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా 1,069 మంది మరణించారు.

దేశంలో తాజాగా నమోదైన గణాంకాలతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 64,73,545 కి చేరగా మరణాల సంఖ్య 1,00,842 కి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యఆరోగ్యశాఖ శనివారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి బారిన పడి ఇప్పటివరకు 54,27,707 మంది బాధితులు కోలుకున్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశంలో 9,44,996 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

కరోనా నుండి కోలుకున్న వారి రిక‌వ‌రీ రేటు 83.84 శాతం ఉండగా మ‌ర‌ణాల రేటు 1.56 శాతంగా ఉంది. అయితే యాక్టివ్ కేసుల రేటు 14.60 శాతం ఉందని వైద్యశాఖ వెల్లడించింది. అయితే దేశంలో కాస్త ఉపశమనం కలిగించే విషయం ఎమిటంటే కరోనా కేసులతోపాటు రికవరీ రేటు కూడా భారీ పెరుగుతోంది. శుక్రవారం దేశవ్యాప్తంగా 11,32,675 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వెల్లడించింది. దీంతో అక్టోబరు 2 వరకు మొత్తం 7,78,50,403 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వెల్లడించింది. అందరు మాస్కులు ధరించి జాగ్రత్త వహించాల్సిందిగా అధికారులు పదే పదే సూచిస్తున్నారు.

Tags :

Advertisement