Advertisement

దేశంలో రికార్డు స్థాయిలో 22 లక్షలు దాటిన కరోనా

By: chandrasekar Mon, 10 Aug 2020 7:33 PM

దేశంలో రికార్డు స్థాయిలో 22 లక్షలు దాటిన కరోనా


వేగంగా వ్యాప్తి చెందుతున్న కరోనా ని కట్టడి చేయడం చాలా కష్టంగా తయారయింది. మన దేశంలో గత 24 గంటల్లో కొత్తగా 62064 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 2215074కి చేరింది. అలాగే గత 24 గంటల్లో 1007 మంది చనిపోవడంతో మొత్తం మరణాల సంఖ్య 44386కి చేరింది. దేశంలో 24 గంటల్లో 1000కి పైగా మరణాలు సంభవించడం ఆందోళన కలిగించే అంశమే. కానీ ప్రపంచ దేశాల్లో మరణాల రేటు 3.67గా ఉండగా ఇండియాలో అది 2 శాతంగానే ఉండటం కాస్త ఊరట కలిగించే విషయం.

దేశంలో గడచిన 24 గంటల్లో ఇండియాలో 54859 మంది రికవరీ అయ్యారు. మొత్తం రికవరీల సంఖ్య 1535743కి చేరింది. రికవరీ రేటు 69.3కి చేరింది. ఇది కూడా దేశంలో రోజురోజుకూ పెరుగుతోంది. అందువల్ల ఇండియా కరోనాను సమర్థంగానే ఎదుర్కోగలుగుతున్నట్లు ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 634945 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో ఇండియాలో 477023 టెస్టులు జరిగాయి. ఫలితంగా మొత్తం టెస్టుల సంఖ్య 24583558కి చేరింది. కానీ టెస్టులు ముందు రోజు కంటే 242341 తక్కువగా అయ్యాయి. ప్రస్తుతం ప్రపంచంలో మొత్తం కేసుల్లో ఇండియా మూడోస్థానంలో ఉండగా రోజువారీ కేసుల్లో అమెరికాను వెనక్కి నెట్టి భారత్ మొదటి స్థానంలో ఉంది.

మొత్తం మరణాల్లో భారత్ టాప్ 5లో ఉండగా రోజువారీ మరణాల్లో అమెరికాను వెనక్కి నెట్టి ఇండియా మొదటి స్థానానికి చేరింది. ప్రపంచంలో మొత్తం కరోనా కేసుల్లో 50 శాతం అంటే కోటికి పైగా అమెరికా, బ్రెజిల్, ఇండియాలోనే ఉన్నాయి. అత్యధిక జనాభా కలిగిన మన దేశంలో వ్యాప్తి ఎక్కువగా ఉండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అనవసరంగా బయటకు వెళ్లకుండా సామజిక దూరం పాటిస్తూ మాస్కులు వాడాలని అధికారులు పదే పదే సూచనలు చేస్తున్నారు.

Tags :
|
|

Advertisement