Advertisement

హైదరాబాద్‌లో కరోనా కన్ఫ్యూషన్

By: chandrasekar Thu, 25 June 2020 6:26 PM

హైదరాబాద్‌లో కరోనా కన్ఫ్యూషన్


హైదరాబాద్‌లో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. లాక్ డౌన్ సడలింపులు తర్వాత మరింతగా విజృంబించింది. అయితే లాక్ డౌన్ సడలింపుల్లో భాగంగా టాలీవుడ్‌లో సీరియల్స్‌తో పాటు సినిమాలకు షూటింగ్ చేసుకునే అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. వివిధ ఛానల్స్‌కు చెందిన సీరియల్ యాజమాన్యాలు షూటింగ్‌‌ను ప్రారంభించాయి. అయితే షూటింగ్ జరుపుతున్న వేళా సీరియల్స్ నటుడు ఒకరు కరోనా బారిన పడ్డారు.

ప్రభాకర్ అనే టీవీ నటుడికి కరోనా అని తేలింది. ఆయన ఇటీవల ఓ సీరియల్ షూటింగ్ లో పాల్గొనడంతో కలలం రేగింది. ఆ షూటింగ్ లో పాల్గొన్ సిబ్బంది అంతా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. అంతేకాదు సదరు టీవీ సీరియల్ షూటింగ్ కూడా ఆగిపోయింది. ఈ నటుడు జీ తెలుగులో ప్రసారం అయ్యే సూర్యకాంతం సీరియల్ లో నటిస్తాడని తెలుస్తోంది.

దీంతో సీరియల్ ఆర్టిస్టులంతా షాక్‌కు గురవ్వడమే కాకుండా వరుసపెట్టి ఫోన్లు చేయడం మొదలుపెట్టారు అతనికి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో చిన్న కన్ఫ్యూజన్ వచ్చింది. ప్రభాకర్ అనే ఓ నటుడుకి కరోనా వస్తే మరో ప్రభాకర్‌కు పరామర్శల తాకిడి మొదలైంది.

ఈటీవీ నుంచి మొదలుపెట్టి జీ తెలుగు వరకు సీరియల్స్ లో నటించిన ప్రభాకర్‌కు కరోనా సోకిందని భావించారు. అంతేకాదు చాలా వార్త సంస్థలు అతని ఫోటోను వాడాయి. దీంతో తాను సేఫ్ గానే ఉన్నానంటూ క్లారిటీ ఇచ్చుకున్నాడు ప్రభాకర్. మరోవైపు మరో ప్రభాకర్‌కు కరోనా సోకడంతో నటీనటులు ఎవ్వరూ షూటింగ్స్ లో పాల్గొనవద్దని తెలుగు టెలివిజన్ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఆదేశాలు జారీచేసింది. ఇక సినీ నిర్మాత బండ్ల గణేష్ కూడా కరోనా బారిన పడ్డాడు.

Tags :
|
|

Advertisement