Advertisement

  • తెలంగాణలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

తెలంగాణలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు

By: chandrasekar Fri, 10 July 2020 10:45 AM

తెలంగాణలో కాస్త తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు


కరోనా కేసులు తెలంగాణలో భారీ స్థాయిలో పెరుగుతూనే ఉన్నాయి. గురువారం గుర్తించిన కేసులు అంతకుముందుతో పోల్చితే కాస్త తగ్గుముఖం పట్టాయి. గురువారం మొత్తం 1,410 కరోనా కొత్త కేసులు నమోదైనట్లుగా హెల్త్ బులెటిన్‌లో పేర్కొన్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,946కు చేరుకుంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసులు 12,423గా ఉన్నాయి. గత 24 గంటల్లో 913 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.

కరోనా నుంచి ఇప్పటి వరకూ పూర్తిగా కోలుకొని డిశ్చార్జి అయిన వారి సంఖ్య 18,192కు చేరింది. ఇక గురువారం మరో ఏడుగురు కరోనాకు బలి కాగా, మొత్తం చనిపోయిన వారి సంఖ్య 331కి చేరింది. గురువారం నాడు గుర్తించిన కరోనా కేసుల్లో జిల్లాల్లోనూ పెద్ద ఎత్తున కేసులను గుర్తించారు. ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే అధికంగా 918 కొత్త కేసులు నమోదు కావడం విస్మయం కలిగిస్తోంది. ఆ తర్వాత కేసుల తాకిడి అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో ఉంది. అక్కడ 125 కొత్త కేసులు నమోదు కాగా, ఆ తర్వాత సంగారెడ్డి జిల్లాలో 79 కొత్త కరోనా కేసులను గుర్తించారు. దాని తర్వాతి స్థానంలో గురువారం మేడ్చల్ జిల్లా ఉంది. ఇక్కడ 67 కేసులు నమోదయ్యాయి.

ఇక జిల్లాల వారీగా నమోదైన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి. మరోవైపు, తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 5,954 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1,410 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 1,40,755కు చేరింది. గురువారం 4,544 ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి. మరోవైపు, తెలంగాణలో బుధవారం ఒక్కరోజే 5,954 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1,410 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 1,40,755కు చేరింది. గురువారం 4,544 ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి.

బుధవారం తెలంగాణలో ఒక్కరోజే 5,954 కరోనా టెస్టులు నిర్వహించారు. వీటిలో నుంచే 1,410 కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకూ తెలంగాణలో చేసిన కరోనా టెస్టుల సంఖ్య 1,40,755కు చేరింది. గురువారం 4,544 ఫలితాలు నెగెటివ్‌గా తేలాయి. గాంధీ మెడికల్ కాలేజీ, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి, పంజాగుట్ట నిమ్స్, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, కాకతీయ మెడికల్ కాలేజీ, హైదరాబాద్ సీసీఎంబీ, సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్‌ప్రింటింగ్ అండ్ డయాగ్నోస్టిక్స్, ఈఎస్ఐసీ, రాజీవ్ గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆదిలాబాద్‌లో కరోనా టెస్టులు చేస్తున్నట్లు తెలిపారు.

Tags :
|
|
|

Advertisement