Advertisement

  • పదిహేను రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య రెట్టింపు

పదిహేను రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య రెట్టింపు

By: Sankar Wed, 03 June 2020 09:04 AM

పదిహేను రోజుల్లోనే కరోనా కేసుల సంఖ్య రెట్టింపు

దేశం లో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది గత పదిహేను రోజులుగా కరోనా కేసుల సంఖ్య రెట్టింపు దశకు చేరుకున్నాయి ..ప్రస్తుతం రెండు లక్షలు దాటిపోయాయి..గత మూడు రోజులుగా రోజు 8 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మంగళవారం (జూన్ 2) ఉదయం వరకు కొత్తగా 8171 కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షలు దాటింది. కరోనాతో గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 204 మంది మరణించారు. దీంతో దేశంలో ఇప్పటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5598కి చేరుకుంది

corona,india,2lakhs,lockdown,maharastra,tamil nadu , కరోనా , రెండు లక్షలు , పదిహేను రోజులు, రెట్టింపు ,  కేసులు

ప్రపంచంలో కరోనా కేసులు అధికంగా నమోదవుతున్న దేశాల్లో భారత్ ఏడో స్థానంలో ఉంది.
18 లక్షలకు పైగా కేసులతో అమెరికా తొలి స్థానంలో ఉండగా.. 5.2 లక్షల కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలో ఉంది. సుమారు 4 లక్షల కేసులతో రష్యా మూడో స్థానంలో ఉంది.2.33 లక్షల కేసులతో ఆరో స్థానంలో ఉన్న ఇటలీని భారత్ ఐదారు రోజుల్లో అధిగమించే అవకాశం ఉంది.

భారత్‌లో నమోదవుతున్న కేసుల్లో 44 శాతం ఒక్క మహారాష్ట్రలోనే ఉన్నాయి. ఆ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 70 వేలు దాటింది. ముంబైలో కరోనా వైరస్ వ్యాప్తి ఆందోళనకరంగా ఉంది.మహారాష్ట్ర తర్వాత తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాల్లో కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఈ రెండు రాష్ట్రాల్లో కేసుల సంఖ్య 20 వేలు దాటింది.

దేశంలో ఇప్పటివరకు కరోనా కేసులు నమోదుకాని మిజోరాం రాష్ట్రంలో 12 కేసులు నిర్ధారణ అయ్యాయి.

దేశంలో కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్‌కు సడలింపులు ఇస్తున్న తరుణంలో కేసుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుండటం ఆందోళనకరంగా మారింది.

కరోనా కేసులు పెరుగుతున్నా.. రికవరీ రేటు పెరుగుతుండటం ఊరట కల్పించే అంశం. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారత్‌లో మరణాల రేటు చాలా తక్కువగా ఉంది.

భారత్‌లో నమోదవుతున్న కరోనా కేసులతో పోలిస్తే.. 14కు పైగా దేశాల్లో నమోదవుతున్న కేసులు 55 రెట్లు అధికంగా ఉన్నాయని ఓ అంచనా.


Tags :
|
|
|

Advertisement