Advertisement

  • రెండు రోజల నుంచి తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

రెండు రోజల నుంచి తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

By: chandrasekar Mon, 26 Oct 2020 4:55 PM

రెండు రోజల నుంచి తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు


రెండు రోజల నుంచి తెలంగాణలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. ఇంతకు మునుపు తెలంగాణలో కరోనావైరస్ కేసుల సంఖ్య నానాటికీ పెరుగుతునే ఉంది. అయితే రెండు రోజల నుంచి రాష్ట్రంలో కేసులు భారీగా తగ్గుముఖం పట్టాయి. కొన్నిరోజుల క్రితం 2 వేలకు పైగా నమోదైన కేసులు ఇటీవల 1500లకు చేరువలో నమోదై ఇప్పుడు 600లకు చేరువలోనే నమోదవుతున్నాయి. ఇటీవల కాలంలో 600లకు చేరువలో కేసులు నమోదు కావడం ఇదే మొదటిసారి. ఇదిలాఉంటే రాష్ట్రంలో కరోనా రికవరీ రేటు కూడా ప్రతిరోజూ పెరుగుతూనే ఉంది. గత 24 గంటల్లో ఆదివారం, అక్టోబరు 25 రాత్రి 8 గంటల వరకు తెలంగాణలో కొత్తగా 582 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నలుగురు (4) మరణించారు. క్రమంగా వైరస్ తీవ్రత తగ్గడం వల్ల కొత్తగా ఎవ్వరు వైరస్ బారిన పడనట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం నమోదైన గణాంకాల ప్రకారం తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,31,834 కి చేరగా మరణాల సంఖ్య 1,311 కి పెరిగింది. ఈ మేరకు తెలంగాణ వైద్యఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. ఇదిలాఉంటే గత 24 గంటల్లో ఈ మహమ్మారి నుంచి 1,432 మంది కోలుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి నుంచి ఇప్పటివరకు 2,11,912 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 18,611 కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. ప్రస్తుతం తెలంగాణలో రికవరీ రేటు 91.40 శాతం ఉండగా మరణాల రేటు 0.56 శాతం ఉంది. తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం 14,729 కరోనా పరీక్షలు చేయగా ఇప్పటివరకు రాష్ట్రంలో అక్టోబరు 25వరకు మొత్తం 40,94,417 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. తెలంగాణలో నమోదైన కేసుల్లో నిన్న అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 174 కేసులు నమోదు కాగా నల్లగొండ జిల్లాలో 87 కేసులు, రంగారెడ్డి జిల్లాల్లో 55 కేసులు నమోదయ్యాయి. ప్రజలు మరింత జాగ్రత్త పాటించినట్లయితే బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతుంది.

Tags :
|
|

Advertisement