Advertisement

ప్రపంచ వ్యాప్తంగా ఆగని కరోనా ఉదృతి ...

By: Sankar Wed, 11 Nov 2020 7:40 PM

ప్రపంచ వ్యాప్తంగా ఆగని కరోనా ఉదృతి ...


ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి స్వైర విహారం చేస్తున్న సంగతి తెలిసిందే. కొన్ని దేశాల్లో అయితే సెకండ్ వేవ్ కూడా మొదలైంది. మునపటి కంటే ఈసారి రోజూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది.

నిన్న ఒక్క రోజు 5,46,652 పాజిటివ్ కేసులు, 9182 మరణాలు సంభవించాయి. కాగా ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 51,969,896కి చేరింది. అలాగే ఇప్పటివరకూ వరల్డ్ వైడ్‌గా 1,282,355 మంది కరోనాతో మరణించారు. ఇక 36,496,892 మంది కోవిడ్‌తో కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

ఇక అమెరికాలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాల్చుతోంది. సెకండ్ వేవ్ కొనసాగుతుండటంతో ప్రతీ రోజూ లక్ష కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అమెరికా వ్యాప్తంగా మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 10,570,896కి చేరింది. అలాగే ఈ వైరస్ వల్ల ఇప్పటివరకూ అమెరికాలో 245,963 మంది మృతి చెందారు.

ఇక బ్రెజిల్, రష్యా, ఫ్రాన్స్, స్పెయిన్, అర్జంటినా, యూకేలలో కరోనా తీవ్రత ఎక్కువగా ఉంది. అటు ఇండియాలో ఇప్పటివరకు 8,636,974 కేసులు నమోదు కాగా.. 127,630 మంది వైరస్ కారణంగా మరణించారు. ఇక యూరోప్‌లో కూడా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోంది.

Tags :
|

Advertisement