Advertisement

ప్రపంచ వ్యాప్తంగా కోటి దాటిన కరోనా కేసులు

By: Sankar Sun, 28 June 2020 10:12 AM

ప్రపంచ వ్యాప్తంగా కోటి దాటిన కరోనా కేసులు



ఒక వైరస్ ..ఒకే ఒక్క వైరస్ ప్రపంచ దేశాలన్నిటిని ఘడఘడలాడిస్తుంది ..ప్రపంచంలో ఉన్న దాదాపు అన్ని దేశాలు తమ యొక్క పనులను మానుకొని ఈ వైరస్ ను అంతమొందించే పనిలో పడ్డాయి ..దాదాపు మూడు నెలల పాటు అన్ని దేశాలు ఎటువంటి కార్యకలాపాలుకు అనుమతి లేకుండా లాక్ డౌన్ ప్రకటించుకున్నాయి ..దేశాల ఆర్ధిక వ్యవస్థలు అన్ని దెబ్బ తినాయి ..క్రీడారంగం మూడు నెలలుగా ఎటువంటి క్రీడలు లేక వెలవెలబోయింది ..ఇలా ప్రతి ఒక్క రంగాన్ని కంటి మీద కునుకు లేకుండ చేసిన కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కోటి కేసులను దాటింది ..

2019 డిసెంబర్‌ 31న సార్స్‌ తరహా వైరస్‌ కేసులు చైనాలోని వూహాన్‌లో వెలుగులోకి వస్తున్నాయని అందరికీ తెలిసినప్పుడు ఇదేదో మామూలు వైరస్‌ అనుకున్నారు. అంతకంతకూ ఆ వైరస్‌ శరవేగంగా విస్తరించింది. అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికింది. తొలి రెండు, మూడు నెలలు చైనాలోని వూహాన్‌తో పాటుగా అమెరికా, ఇటలీ, స్పెయిన్, యూకే దేశాలు అల్లాడిపోయాయి. ఆ తర్వాత యూరప్‌లో కొన్ని దేశాలు కోలుకున్నప్పటికీ అమెరికాను కేసుల భయం వెంటాడుతూనే ఉంది. శనివారం రాత్రికి ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,00,00,418కు, బాధితుల మరణాల సంఖ్య 4,98,952కు చేరాయి.

కరోనా వైరస్‌ విస్తరణ దడ పుట్టించేలా ఉన్నప్పటికీ, వేరే ఇతర వ్యాధులు ఉన్నవారికే ఇది అత్యంత ప్రమాదకరం. మిగిలిన వారికి కేవలం ఇదొక ఫ్లూ లాంటి జ్వరం మాత్రమేనని వైద్యులు చెబుతున్నారు. కొన్ని ముందు జాగ్రత్త చర్యలతో ఈ వైరస్‌ను అరికట్టవచ్చునని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. డబ్ల్యూహెచ్‌ఓ అంచనాల ప్రకారం మొత్తం కేసుల్లో ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేకుండానే వ్యాధి అదుపులోకి వచ్చే కేసులు 80% వరకు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరినా కోలుకున్న కేసులు 15 శాతం ఉంటే, వాటిలో విషమంగా మారిన కేసులు 5శాతం. ఆ 5శాతం కేసుల్లోనూ సగం మందికే ప్రాణాలకు ముప్పు ఉంటోంది.

Tags :
|
|
|

Advertisement