Advertisement

  • దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలోకరోనా కేసులు

దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలోకరోనా కేసులు

By: chandrasekar Mon, 07 Sept 2020 10:01 AM

దేశంలో 24 గంటల్లో రికార్డు స్థాయిలోకరోనా కేసులు


దేశంలో శనివారం కరోనా కేసులు విస్తృతంగా పెరుగుతున్నాయి. కేవలం 24 గంటల్లో రికార్డు స్థాయిలో 90,632 కేసులు నమోదయ్యాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 41,13,811కు చేరుకుంది. నాలుగు రోజులుగా రోజుకు 80 వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 73,642 మంది కోలుకోగా 1,065 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 70,626కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 31,80,865కు చేరుకోగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 8,62,320గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసులు 20.96 శాతం ఉన్నాయి. శనివారానికి ఇది 77.32 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు ప్రస్తుతం 1.72 శాతానికి పడిపోయిందని తెలిపింది. దేశంలో కరోనా రికవరీ రేటు క్రమంగా పెరుగుతోంది.

ఇంజనీర్డ్‌ సర్ఫేస్‌ను తయారుచేసిన ఐఐటీకి చెందిన నిపుణులు


ఐఐటీ గువాహటికి చెందిన నిపుణులు కరోనాను గుర్తించడానికి, ఎదుర్కోవడానికి ఇంజనీర్డ్‌ సర్ఫేస్‌ను తయారు చేశారు. కరోనా వైరస్‌ రెండు భాగాలుగా ఉంటుందని అందులో లోపలి పొర న్యూక్లియిక్‌ ఆసిడ్‌ ఉండగా, బయటి వైపు గ్లైకోప్రొటీన్‌ అనే కొమ్ములు ఉంటాయని చెప్పారు. ఈ సర్ఫేస్‌ మీద కరోనా వైరస్‌ పడితే వెంటనే గుర్తించవచ్చని చెప్పారు. ఇందులో పలు సెల్ఫ్‌ అసెంబుల్డ్‌ మోనో లేయర్స్‌ ఉన్నాయని తెలిపారు. కరోనా వంటి ప్రొటీన్లు దానిపై పడినప్పుడు అవి పీల్చుకుంటాయని చెప్పారు. ప్రత్యేకించి ఈ సర్ఫేస్‌ను పీపీఈలకు తగిలించినప్పుడు కరోనాను గుర్తించడమేగాక, నాశనం చేయవచ్చని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ పలు జర్నల్స్‌లో సైతం ప్రచురితమైనట్లు తెలిపారు.

Tags :
|
|

Advertisement