Advertisement

  • దేశంలో కొన్ని ప్రధాన నగరాల్లో విజృంభిస్తున్న కరోనా కేసులు

దేశంలో కొన్ని ప్రధాన నగరాల్లో విజృంభిస్తున్న కరోనా కేసులు

By: chandrasekar Mon, 15 June 2020 11:44 AM

దేశంలో కొన్ని ప్రధాన నగరాల్లో విజృంభిస్తున్న కరోనా కేసులు


కరోనా కేసులు దేశాన్ని అతలాకుతలం చేస్తూ ప్రజలను మరింత భయాందోళనకు గురిచేస్తున్నాయి. కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తున్నది. ప్రధానంగా 15 నగరాల్లో వైరస్‌ వణికిస్తున్నది. గురుగ్రామ్‌, ఫరిదాబాద్‌, వడోదర, సోలాపూర్‌, గౌహతి వంటి 15 నగరాల్లో కరోనా కేసులు పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నగరాల్లో గత పది రోజుల్లో కరోనా కేసులు 45-50 శాతం పెరిగాయి. గౌహతి నగరంలో గత పది రోజుల్లో 50 శాతం వైరస్‌ కేసులు కొత్తగా నమోదయ్యాయి. వడోదరలో ప్రతి రోజు సగటున 50 కేసులు వెలుగుచూస్తున్నాయి.

గురుగ్రామ్‌లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉన్నది. ఈ నెల 2 నుంచి 12 వరకు 1,839 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ నగరంలో వైరస్‌ కేసుల వృద్ధి 63 శాతంగా ఉన్నది. దీంతో హర్యానా ప్రభుత్వం శనివారం కొత్తగా 32 ప్రాంతాలను కంటైన్‌మెంట్‌ జోన్లగా ప్రకటిచింది. రాజస్థాన్‌లోని భారత్‌పూర్‌, నాగౌర్‌, ఛత్తీస్‌గడ్‌లోని రాయ్‌గఢ్‌, ఉత్తరప్రదేశ్‌లోని ఫరీదాబాద్‌, ఆగ్రా, లక్నో, మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌, ఇండోర్‌, ఉజ్జాయిని, మహారాష్ట్రలోని నాగపూర్‌ నగరాల్లో కరోనా కేసుల తీవ్రగా ఎక్కువగా ఉన్నది. గత నాలుగు రోజుల్లో భోపాల్‌లో 163, ఇండోర్‌లో 147 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇండోర్‌లో మాదిరిగా భోఫాల్‌లోనూ కరోనా పరీక్షలను పెంచాలని మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించింది. నాగపూర్‌లో గత రెండు రోజుల్లో వందకుపైగా కరోనా కేసులు బయటపడ్డాయి.

మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నగరంలోని హాట్‌స్పాట్‌ కేంద్రాల సంఖ్యను పెంచింది. దేశవ్యాప్తంగా కొత్తగా నమోదవుతున్న కరోనా కేసుల్లో 63 శాతం ఈ 15 నగరాలకు చెందినవేనని గణాంకాల ద్వారా తెలుస్తున్నది. మహారాష్ట్రలోని మొత్తం కరోనా కేసుల్లో 54.73 శాతం ముంబైకి చెందినవే. తమిళనాడులోని మొత్తం కేసుల్లో 70 శాతం చెన్నైకి, గుజరాత్‌లోని మొత్తం వైరస్‌ కేసుల్లో 70.86 శాతం అహ్మదాబాద్‌ నగరంలో నమోదైనట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. దేశంలో మొత్తం కరోనా కేసులు 3 లక్షలను దాటగా ఇందులో 18 శాతంతో మహారాష్ట్ర తొలిస్థానంలో ఉండగా, 12.22 శాతం కేసులతో ఢిల్లీ రెండో స్థానంలో, 9.65 శాతం వైరస్‌ కేసులతో తమిళనాడు మూడోస్థానంలో ఉన్నాయి.

Tags :
|

Advertisement