Advertisement

  • కరోనా పుట్టినిల్లులో తెరుచుకోనున్న స్కూల్స్..

కరోనా పుట్టినిల్లులో తెరుచుకోనున్న స్కూల్స్..

By: Sankar Sat, 29 Aug 2020 10:03 PM

కరోనా పుట్టినిల్లులో తెరుచుకోనున్న స్కూల్స్..


కరోనా పుట్టినిల్లు అయిన వుహాన్ లో పరిస్థితులు చక్కబడుతున్నాయి..గత కొంత కాలంగా కొవిడ్ -19 కేసులు ఒక్కటి కూడా లేకుండా గ్రౌండ్ జీరోగా మారిని చైనాలోని వుహాన్ పట్టణంలో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఉన్నత పాఠశాలలు ఇప్పటికే తెరుచుకోగా.. ఇప్పుడు కిండర్ గార్డెన్ మొదలుకొని అన్ని మాధ్యమాల పాఠశాలలు మంగళవారం నుంచి తెరుచుకోనున్నాయి. వుహాన్ నగరంలోని 2,842 విద్యాసంస్థలు దాదాపు 1.4 మిలియన్ల విద్యార్థులకు తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉన్నాయని స్థానిక ప్రభుత్వం ప్రకటించింది. వుహాన్ విశ్వవిద్యాలయం కూడా సోమవారమే తిరిగి ప్రారంభమైంది.

రిస్క్ లెవల్స్ మారినపక్షంలో ఆన్‌లైన్ బోధనకు తిరిగి మారడానికి అత్యవసర ప్రణాళికలను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. పాఠశాలకు వచ్చే విద్యార్థులంతా విధిగా మాస్కులు ధరించాలని, వీలైతే ప్రజా రవాణాను నివారించాలని విద్యార్థులకు సూచించింది.

వ్యాధుల నియంత్రణ పరికరాలను నిల్వ ఉంచాలని, వ్యాప్తికి సంబంధించిన శిక్షణా సమావేశాలు నిర్వహించాలని పాఠశాలలను ఆదేశించారు. సామూహిక సమావేశాలను కూడా పరిమితం చేయాలని, రోజువారీ నివేదికలను ఆరోగ్య అధికారులకు సమర్పించాలని ఆదేశించారు.

Tags :
|
|

Advertisement