Advertisement

  • వరల్డ్‌ నెం.1 సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కి కూడా కరోనా

వరల్డ్‌ నెం.1 సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కి కూడా కరోనా

By: chandrasekar Wed, 24 June 2020 10:14 AM

వరల్డ్‌ నెం.1 సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కి కూడా కరోనా


ప్రపంచవ్యాప్తంగా కొంత మంది క్రికెటర్లు ఈ వైరస్ బారినపడగా ఇప్పుడు టెన్నిస్ ఆటగాళ్లు కూడా ఒకరి తర్వాత ఒకరు తమకి కరోనా వైరస్ సోకినట్లు ప్రకటిస్తున్నారు. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో 19వ స్థానంలో ఉన్న బల్గేరియా క్రీడాకారుడు గ్రిగోర్ దిమిత్రోవ్ తొలుత తనకి కరోనా సోకినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించగా ఆ తర్వాత క్రొయేషియా ఆటగాడు బోర్నా కొరిచ్ కూడా తాను ఆ మహమ్మారి బారినపడినట్లు వెల్లడించాడు.

తాజాగా వరల్డ్‌ నెం.1, సెర్బియా టెన్నిస్ దిగ్గజం నొవాక్ జకోవిచ్‌కి కూడా కరోనా పాజిటివ్‌గా తేలింది. జకోవిచ్ ఆధ్వర్యంలో ఇటీవల ఆడ్రియా టూర్ ఎగ్జిబిషన్ టోర్నీ జరిగింది. ఆ టోర్నీలో జకోవిచ్‌తో పాటు గ్రిగోర్ దిమిత్రోవ్ కూడా మ్యాచ్‌‌లు ఆడాడు.

దాంతో గ్రిగోర్ దిమిత్రోవ్‌కి పాజిటివ్ అని తేలగానే జకోవిచ్‌ నుంచి సోమవారం శాంపిల్స్‌ని సేకరించి పరీక్షించగా ఈరోజు పాజిటివ్‌గా రిపోర్ట్ వచ్చింది. దాంతో ఇప్పుడు ఆ టోర్నీలో పాల్గొన్న ప్రతి ఆటగాడికీ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇటీవల రోజర్ ఫెదరర్, రఫెల్ నాదల్‌తో కలిసి తక్కువ ర్యాంక్‌‌లో ఉన్న టెన్నిస్ ఆటగాళ్లని ఆదుకోవాలని నొవాక్ జకోవిచ్ చాలా తాపత్రయపడ్డాడు.

కరోనా వైరస్ కారణంగా టోర్నీలన్నీ రద్దవగా స్పాన్సర్లు, సంఘాల నుంచి సపోర్ట్ లేదని యువ ఆటగాళ్లు ఆవేదన వ్యక్తం చేస్తుండటంతో వారిని ఆదుకునేందుకు ‘‘బిగ్-3’’ని ఏర్పాటు చేశాడు. ఏటీపీ ఏర్పాటు చేసే సహాయనిధికి గ్రాండ్‌స్లామ్ ద్వారా వచ్చే ఆదాయంలో కొంత కేటాయిస్తామని ఇటీవల ప్రకటించింది.

Tags :
|
|

Advertisement