Advertisement

  • కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హోంగార్డుకు కరోనా

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హోంగార్డుకు కరోనా

By: chandrasekar Tue, 16 June 2020 7:00 PM

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హోంగార్డుకు కరోనా


కాణిపాకం ఆలయం ల్లో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా అని తేలింది. దీంతో చిత్తూరు జిల్లా కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలోకి భక్తుల అనుమతిని నిషేధించారు. ఆలయంలో పనిచేసే సిబ్బందిలో ఒకరికి కరోనా పాజిటివ్ రావడంతో ఆలయాన్ని మూసివేయవలసి వచ్చింది.

కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ హోంగార్డుకు కరోనా వైరస్‌ సోకింది. దీంతో భక్తుల అనుమతిని నిషేధించారు. రెండు రోజుల పాటు దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మొత్తం 60 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఏపీలో కూడా కేసులు ఎక్కువవుతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఆలయ నిర్వాహకులు ఆలయ సిబ్బంది అందరికీ కరోనా టెస్టులు చేయించారు. వాటి రిపోర్టులు తాజాగా వస్తున్నాయి. కాణిపాకం ఆలయాన్ని ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మరీ తెరిచారు.

భక్తులు అన్ని విధాలా సోషల్ డిస్టాన్స్ పాటించేలా చేశారు. మాస్కులు తప్పనిసరి అన్నారు. అన్ని రూల్సూ పాటించినా కరోనా వదల్లేదు. అందువల్ల తాత్కాలికంగా భక్తులకు ఆలయ ప్రవేశాన్ని నిలిపేస్తూ ఆలయ ఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవలే శ్రీకాళహస్తి ఆలయ అర్చకుడికి కరోనా పాజిటివ్ రావడంతో ఆలయంలో భక్తులకు దర్శనాలు నిలిపివేశారు.

సాధారణంగా తిరుమలకు వచ్చే భక్తులు కాణిపాకం వినాయక స్వామిని కూడా దర్శించుకుంటారు. తిరుమల స్వామివారి దర్శనం తర్వాత చాలా మంది కాణిపాకం వస్తుంటారు. ప్రతిజ్ఞలు కూడా చేస్తుంటారు. ఇటీవలే తిరుమల ఆలయం తెరుచుకోవడంతో కాణిపాకం కూడా వస్తున్నారు భక్తులు. అయితే కరోనా కారణంగా ఆలయంలో భక్తులకు నిషేధం అమలు చేయడం భక్తులకు నిరాశే మిగిలింది. కరోనా సమయంలో తప్పదు అని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 5,858కి చేరింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 1,068కాగా, విదేశాల నుంచి వచ్చిన వారు 202 మంది ఉన్నారు.

Tags :

Advertisement