Advertisement

సినీ ఇండస్ట్రీలో దుమారం లేపుతున్న కరోనా

By: chandrasekar Wed, 24 June 2020 7:46 PM

సినీ ఇండస్ట్రీలో దుమారం లేపుతున్న కరోనా


కరోనా దేశంలోనే అత్యధిక కేసులు నమోదవుతున్నఈ సమయంలో సినీ ఇండస్ట్రీలో దుమారం లేపుతుంది. లాక్‌డౌన్‌ సమయంలో కరోనా వ్యాప్తి నిరోధానికి పలు సూచనలు చేసి అందరిలో అవగాహన కల్పించిన సినీ ప్రముఖులు ఇప్పుడు ఇంటిపట్టునే వుంటున్నారు. ఎటువంటి కార్యక్రమాలకు హాజరుకావడం లేదు. చిన్న పెద్ద, ధనిక, పేద తేడా లేకుండా కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారట. అంతేకాదు షూటింగ్‌లకు ప్రభుత్వం అనుమతిచ్చినా కరోనా పోయే వరకు షూటింగ్‌ల్లో కూడా పాల్గొనేది లేదని ఖరాఖండిగా చెప్పారట.

ఇక ఇటీవల ఓ కమెడియన్‌, నిర్మాతకు కరోనా పాజిటివ్‌ రావడంతో టాలీవుడ్‌ ఉలిక్కిపడింది. సదరు వ్యక్తిని కలిసిన అందరిలోనూ టెన్షన్‌ మొదలైంది. అంతేకాదు కొంతమంది స్వచ్చందగా కరోనాటెస్టులు కూడా చేయించుకుంటున్నారని తెలిసింది. అయితే దాదాపుగా సినిమా హీరోలందరూ సాధారణంగా ఫిట్‌నెస్‌పై శ్రద్ధపెట్టడం, యోగా, మెడిటేషన్ల అలవాటు వుండటంతో కరోనా అంత త్వరగా వ్యాప్తిచెందే అవకాశం లేదు. కానీ మన జాగ్రత్తలో మనం వుండాలి అంటూ ఇంట్లోనే సేఫ్‌గా వుంటూ ఫ్యామిలీతో సమయాన్ని గడుపుతున్నారు.

Tags :
|

Advertisement