Advertisement

  • ఏపీ మాజీ ఎలక్షన్ కమీషనర్ ఇంటి అద్దె బకాయి 7 లక్షలు..

ఏపీ మాజీ ఎలక్షన్ కమీషనర్ ఇంటి అద్దె బకాయి 7 లక్షలు..

By: Sankar Thu, 10 Sept 2020 4:29 PM

ఏపీ మాజీ ఎలక్షన్ కమీషనర్ ఇంటి అద్దె బకాయి 7 లక్షలు..


బెజవాడలో మాజీ ఎన్నికల కమిషనర్ ఇంటి అద్దె వివాదం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన సమయంలో ..వల్లూరి రవీంద్రనాధ్ ఫ్లాట్ లో కనగరాజ్‌ అద్దెకు దిగారు. నెలకు ఫ్లాట్ అద్దె లక్షా 11 వేలుగా నిర్ణయించారు. అయితే 6 నెలల అద్దె చెల్లించలేదని ఫ్లాట్ యజమాని రవీంద్రనాధ్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు ఫ్లాట్ లో ఉన్న ఫర్నిచర్ తరలించేందుకు పంచాయితీ రాజ్ ఉద్యోగులు ప్రయత్నించడంతో ఇంటి యజమాని అడ్డుకున్నారు. దీంతో పంచాయితీ రాజ్ అధికారులు పోలీసుల్ని ఆశ్రయించారు.

ఏప్రిల్ 11 నాడు ఎలక్షన్ కమిషనర్ గా కనగరాజు మా అపార్ట్మెంట్ లో దిగారని, డి3 ప్లాట్ తీసుకుని అద్దె కడతామని అగ్రిమెంట్ చేసి కట్టకుండా వాయిదాలు వేశారని యజమాని రవీంద్రనాధ్ పేర్కొన్నారు. ఇప్పుడు పర్మిచర్ తీసుకుని వెళతామని పంచాయతీ రాజ్ అధికారులు వచ్చారని, అధికారికంగా మేము ఒక లెటర్ ఇచ్చి తీసుకొని వెళ్లాలని కోరామని ఆయన పేర్కొన్నారు.

కానీ అధికారులు పోలీసులకు ఫోన్ చేసి పిలిపించారని మాకు 6 నెలలుగా అద్దె కింద ఏడు లక్షలు రావాల్సి ఉంది, అధికారులు ఎవరూ కూడా దీనిపై స్పందించడం లేదని ఆయన వాపోయారు. మేము ఎవరికి వ్యతిరేకము కాదు .. ఇప్పుడు కూడా అగ్రిమెంట్, లెటర్ ఇచ్చి పర్మిచర్ తీసుకొని వెళ్లాలని, మాకు రావాల్సిన అద్దె పై న్యాయస్థానం లో చూసుకుంటామని ఆయన అన్నారు. మేము ఏ పార్టీకి చెందిన వాళ్లం కాదన్న ఆయన సాధారణ ప్రజలమని మమ్మల్లి ఈ విదంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదని కోరుతున్నామని అన్నారు.

Tags :
|
|
|

Advertisement