Advertisement

  • భూమి సెటిల్‌మెంట్‌కు సంబంధించి రెండు గ్రూపుల మధ్య వివాదం

భూమి సెటిల్‌మెంట్‌కు సంబంధించి రెండు గ్రూపుల మధ్య వివాదం

By: chandrasekar Tue, 02 June 2020 1:18 PM

భూమి సెటిల్‌మెంట్‌కు సంబంధించి రెండు గ్రూపుల మధ్య వివాదం


విజయవాడ గ్యాంగ్‌వార్‌లో కొత్త ట్విస్ట్‌ వెలుగుచూసింది. మొదటి రెండు విద్యార్థి గ్రూపుల మధ్య గొడవ జరిగిందని వార్తలు వచ్చినప్పటికీ ఆలస్యంగా కొత్త విషయాలు వెలుగుచూశాయి. యనమలకుదురులో రూ.2కోట్ల విలువైన భూమి సెటిల్‌మెంట్‌కు సంబంధించి రెండు గ్రూపుల మధ్య వివాదం జరిగిందని షాకింగ్ విషయం తెలిసింది. ఒకే ల్యాండ్‌ వివాదంలో రెండు గ్రూపులు జోక్యంతో హత్యాయత్నం జరిగింది. రాజీ కుదుర్చుకునేందుకు వచ్చి దాడులు చేసుకున్నట్టు తెలియవచ్చింది. ఇరువర్గాల పరస్పర రాళ్ల దాడిలో ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. మరోవైపు ఇప్పటికే కేసు నమోదు చేసుకున్న పోలీసులు గ్యాంగ్‌వార్‌లో క్షతగాత్రుల వివరాలు సేకరిస్తున్నారు.

ఇవాళ ఉదయం రెండు గ్రూపులు పరస్పరం కత్తులు, కర్రలు, రాళ్లతో దాడులు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో పలువురికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నగరంలోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స తీసుకుంటున్నారు. కాగా పలువురు మాజీ రౌడీషీటర్లు పాల్గొన్నట్టు సమాచారం. ఈ స్ట్రీట్ ఫైట్‌లో ముప్పైమంది యువకులు పాల్గొన్నట్లు తెలుస్తోంది. అయితే రాజకీయ నేతల అండదండలు ఉండటంతో ఈ వ్యవహారాన్ని గుట్టుగా విచారణ చేపడుతున్నారు.

Tags :
|
|

Advertisement