Advertisement

  • సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు హర్షం

సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు హర్షం

By: chandrasekar Tue, 29 Sept 2020 07:39 AM

సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు హర్షం


సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం వల్ల కాంట్రాక్ట్ లెక్చరర్లు హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్ర ప్రదేశ్ లోని ప్రభుత్వ కాలేజీలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్ల వినతి మేరకు ఏపీ సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారి జీతాలపై త్వరలో కొత్త జీవో విడుదల చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఒక్కో విభాగాన్ని చక్కబెడుతూ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలోని కాంట్రాక్ట్ లెక్చరర్లకు వైఎస్ జగన్ సర్కార్ శుభవార్త అందించింది. ప్రభుత్వ నిర్ణయంతో చాలామంది కాంట్రాక్టు ఉపాధ్యాయులకు లబ్ది చేకూరనుంది.

రాష్ట్రంలో వివిధ కళాశాలల్లో పనిచేసే ఉపాధ్యాయుల జీతాల సమస్య నుంచి తమకు పరిష్కారం చూపాలని కోరిన ఏపీలోని ప్రభుత్వ జూనియర్, పాలిటెక్నిక్, డిగ్రీ కాలేజీల కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఊరట కలిగించారు. కాంట్రాక్ట్ లెక్చరర్ల వినతి మేరకు ఇప్పటివరకూ అందుకుంటున్న 10 నెలల జీతాన్ని 12 నెలలకు పెంచుతూ ఆదివారం సీఎం వైఎస్ జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏడాదిపాటు ప్రతినెలా జీతాలను కాంట్రాక్ట్ లెక్చరర్లకు అందించేలా త్వరలో ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయనుంది. ఈ నిర్ణయంతో ఏపీలోని 5,042 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులకు లబ్ధి చేకూరనుంది.

ఇంతకు మునుపు వీరికి పది నెలల జీతం మాత్రమే అందిస్తున్నారు. ఇకమీదట ప్రభుత్వ జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్, ప్రైవేట్ ఓరియంటల్, ప్రభుత్వం ఒకేషనల్ కళాశాలల్లో సేవలందిస్తున్న కాంట్రాక్ట్ లెక్చరర్లకు ఇకనుంచి 12 నెలలపాటు జీతం అందనుంది. కాంట్రాక్ట్ లెక్చరర్ల వినతి మేరకు సానుకూలంగా స్పందించిన ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆదివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయంతో కాంట్రాక్ట్ లెక్చరర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దీనివల్ల చాలా మందికి సంవత్సరం పూర్తిగా ఉపాధి మార్గం కలిగినట్లు ఉంటుంది.

Tags :

Advertisement