Advertisement

  • గత మూడు గంటలుగా హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా భారీ వర్షం..

గత మూడు గంటలుగా హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా భారీ వర్షం..

By: Sankar Tue, 13 Oct 2020 5:14 PM

గత మూడు గంటలుగా హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా భారీ వర్షం..


నిన్న‌టి నుంచి కురుస్తున్న భారీ వ‌ర్షాలు భాగ్య‌న‌గరాన్ని ముంచెత్తుతున్నాయి. కుండ‌పోత వాన‌ల‌కు హైద‌రాబాద్ న‌గ‌రం విల‌విల‌లాడిపోతోంది. గ‌త 3 గంట‌ల నుంచి జంట న‌గ‌రాల్లో నాన్‌స్టాప్‌గా వ‌ర్షం కురుస్తూనే ఉంది. దీంతో లోత‌ట్టు ప్రాంతాల ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

ప్ర‌ధాన ర‌హ‌దారుల‌పై వ‌ర్ష‌పు నీరు నిలిచిపోవ‌డంతో ప్ర‌యాణికులు, వాహ‌న‌దారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా ప్రాంతాల్లో భారీ వృక్షాలు నేల‌కొరిగాయి. విద్యుత్ స‌ర‌ఫ‌రాకు అంత‌రాయం ఏర్ప‌డింది. భారీ వ‌ర్షాల నేప‌థ్యంలో జీహెచ్ఎంసీ సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. జీహెచ్ఎంసీ కంట్రోల్ రూమ్‌కు వ‌స్తున్న ఫిర్యాదుల‌ను స్వీక‌రించి.. ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటూ స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌డుతున్నారు.

మ‌రో రెండు రోజుల పాటు వాన‌లు ప‌డే అవ‌కాశం ఉంద‌ని వాతావ‌ర‌ణ శాఖ హెచ్చ‌రించింది. పిల్ల‌లు, వృద్ధులు బ‌య‌ట‌కు రావొద్ద‌ని జీహెచ్ఎంసీ అధికారులు హెచ్చ‌రిస్తున్నారు. శిథిలావ‌స్థ భ‌వ‌నాల్లో ఉన్న ప్ర‌జ‌ల‌ను ఖాళీ చేయించాల‌ని అధికారుల‌ను జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ ఆదేశించారు.

Tags :
|

Advertisement