Advertisement

  • 11 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కల్తీ మద్యం

11 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కల్తీ మద్యం

By: chandrasekar Fri, 16 Oct 2020 5:43 PM

11 మంది ప్రాణాలను పొట్టనబెట్టుకున్న కల్తీ మద్యం


కల్తీ మందు సేవించి 11 మంది ప్రాణాలు పోయాయి. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో ఈ విషాదం చోటు చేసుకుంది. కల్తీ మద్యం తాగిన ఘటనలో గత 24 గంటల్లో కనీసం 11 మంది మృతి చెందారని పోలీసు అధికారులు పేర్కొన్నారు. బాధితుల్లో నిరుపేద కూలీలు, యాచకులు ఉన్నట్లు తెలిపారు. ఉజ్జయినిలోని ఖారాకువా, జివాజీగంజ్‌, మహాకల్‌ పోలీస్‌ స్టేషన్ల పరిధిలో ఈ మరణాలు సంభవించాయి. వీరంతా హానికరమైన కల్తీ మద్యం తాగడం వల్లే మరణించారని ఉజ్జయిని అదనపు ఎస్పీ రూపేశ్‌ ద్వివేది తెలిపారు. వారు ఆ కల్తీ మద్యాన్ని ఎక్కడ నుంచి తీసుకొచ్చారు? కల్తీ మద్యాన్ని ఎవరు అమ్మరనే అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు. ఈ ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఖరాకువా ఇన్‌స్పెక్టర్‌, సబ్‌ ఇన్‌స్పెక్టర్‌, ఇద్దరు కానిస్టేబుళ్లను ఎస్పీ మనోజ్‌ కుమార్‌ సింగ్‌ సస్పెండ్‌ చేశారని అదనపు ఎస్పీ చెప్పారు.

హాస్పిటల్‌కు తీసుకొచ్చే సమయానికి బాధితులందరూ విషమ స్థితిలో ఉన్నారని 15 నిమిషాల వ్యవధిలోనే ప్రాణాలు కోల్పోయారని ఉజ్జయిని ముఖ్య వైద్యాధికారి మహవీర్ ఖండేల్‌వాల్ తెలిపారు. కల్తీ మద్యం తాగడంతోనే వారి ఆరోగ్య పరిస్థితి విషమించి ఉంటుందని ఆయన తెలిపారు. వారు సేవించిన దాంట్లో స్పిరిట్‌ లేదా ఇతర కొన్ని రసాయనాలు ఉన్నట్టు తెలుస్తోందన్నారు. పరీక్షల్లో మరిన్ని వివరాలు బయటపడతాయని తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌.. గురువారం భోపాల్‌లోని తన నివాసంలో ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించి ఘటనపై సిట్‌ దర్యాప్తునకు ఆదేశించారు. విషపూరిత పదార్థాలు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చౌహాన్ సూచించారు.

Tags :
|

Advertisement