Advertisement

  • కాంటాక్ట్‌ లెన్స్‌లు...తీసుకోవలసిన జాగ్రత్తలు...

కాంటాక్ట్‌ లెన్స్‌లు...తీసుకోవలసిన జాగ్రత్తలు...

By: chandrasekar Mon, 09 Nov 2020 6:32 PM

కాంటాక్ట్‌ లెన్స్‌లు...తీసుకోవలసిన జాగ్రత్తలు...


కంటిలో దృష్టి లోపాలు ఉంటే కంటి అద్దాలు వాడాల్సిన పరిస్థితి. ఇవి రోజూ ధరించాలంటే చికాకుగా ఉంటుంది. ఈ సమస్యకు పరిష్కారంగా రెనే డెస్కార్టెస్, థామస్ యంగ్, అడాల్ఫ్ ఫిక్లాంటి శాస్త్రవేత్తలు కాంటాక్ట్‌ లెన్స్‌లను అభివృద్ధి చేశారు. అప్పటినుంచి చాలామంది కంటిఅద్దాలను పక్కకు విసిరేసి కాంటాక్ట్‌ లెన్స్‌ పెట్టుకుంటున్నారు. మరి వీటి వల్ల ప్రయోజనాలు ఎన్ని ఉన్నాయో నష్టాలు అన్నే ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ కాంటాక్ట్‌ లెన్స్‌ వాడితే కంటిచూపునకు ఎలాంటి ప్రమాదం ఉండదు. కాంటాక్ట్ లెన్స్‌ల వల్ల ప్రయోజనాలు కంటి అద్దాలతో పోలిస్తే మెరుగైన సహజ దృష్టిని అందిస్తాయి. క్రీడలు, బహిరంగ కార్యకలాపాలకు ఆటంకం కలిగించవు. పొగమంచువల్ల దృష్టికి ఇబ్బంది ఉండదు.

కళ్లను రుద్దితే కాంటాక్ట్‌ లెన్స్‌ దెబ్బతింటాయి. కళ్లకు కూడా ప్రమాదమే. రాత్రిపూట లెన్స్‌లను అలాగే వదిలేస్తే కార్నియల్‌ ఇన్‌ఫెక్షన్స్‌ వచ్చే అవకాశముంది. కళ్లలో చెత్త, ఇతర పదార్థాలు పడ్డప్పుడు కంటి ఇన్ఫెక్షన్లకు దారితీయవచ్చు. కాంటాక్ట్‌ లెన్స్‌ రొటేషన్‌ అయితే కంటిచూపుపై ప్రభావం పడుతుంది.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు:

ఎక్కువసేపు కాంటాక్ట్ లెన్స్‌లు ధరించవద్దు.

నేత్ర వైద్యుడు సూచించిన వ్యవధి కంటే ఎక్కువసేపు ధరించడం వల్ల దృష్టితో పాటు లెన్స్ కూడా దెబ్బతింటుంది.

కాంటాక్ట్ లెన్స్‌ను పెట్టుకున్న తర్వాత అసౌకర్యం లేదా చికాకు అనిపిస్తే వాటిని తీసేసి, కంటి డాక్టర్‌ను సంప్రదించాలి.

లెన్స్‌లను పెట్టుకునేటప్పుడు, తొలగించేటప్పుడు చేతులను తప్పనిసరిగా కడుక్కోవాలి. లెన్స్‌లు పెట్టుకున్నప్పుడు మంటకు దూరంగా ఉండాలి.

కాంటాక్ట్ లెన్స్‌లను శుభ్రపరచడం, నిల్వ చేయడం, స్టెరిలైజేషన్‌కు సంబంధించి సరైన జాగ్రత్తలు తీసుకోవాలి.

Tags :
|

Advertisement