Advertisement

  • చాంద్రాయణగుట్టలో కొత్త ఫ్లై ఓవర్‌ నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం

చాంద్రాయణగుట్టలో కొత్త ఫ్లై ఓవర్‌ నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం

By: chandrasekar Mon, 10 Aug 2020 2:36 PM

చాంద్రాయణగుట్టలో కొత్త ఫ్లై ఓవర్‌ నిర్మాణం పనులు త్వరలో ప్రారంభం


నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రహదారిపై ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగుటకు చాంద్రాయణగుట్టలో కొత్త ఫ్లై ఓవర్‌ నిర్మాణం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఉండే ఈ రహదారిపై ట్రాఫిక్‌ ఇబ్బందులు తొలగనున్నాయి. చాంద్రాయణగుట్ట చౌరస్తాలో ఉన్న ఫ్లై ఓవర్‌ బ్రిడ్జికి అనుసంధానంగా కొత్త బ్రిడ్జిని నిర్మించడానికి అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. జాతీయ రహదారి కావడంతో ప్రతిరోజూ వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారని చాంద్రాయణగుట్ట ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించడంతో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కొత్త బ్రిడ్జి నిర్మాణానికి రూ.38 కోట్లు మంజూరు చేసింది.

బ్రిడ్జి నిర్మాణం పనులు సాధ్యమైనంత త్వరగా చేపట్టేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. ఇప్పటికే రహదారికి పక్కన ఉన్న తాగునీటి పైపులైన్‌, విద్యుత్‌ స్తంభాలను జలమండలి, విద్యుత్‌ అధికారులు తొలిగిస్తున్నారు. ప్రస్తుతం చౌరస్తాలో ఉన్న ఫ్లై ఓవర్‌ బ్రిడ్జి పై నుంచి సంతోష్‌నగర్‌ మీదుగా కాటేదాన్‌ వైపు, కాటేదాన్‌ నుంచి సంతోష్‌నగర్‌ వైపు ఫ్లై ఓవర్‌ మీదుగా వాహనాలు రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్‌ అందుబాటులోకి వస్తే ఫలక్‌నుమా మీదుగా బార్కాస్‌, శ్రీశైలం వైపు, బండ్లగూడ శంషాబాద్‌ వైపు, సంతోష్‌నగర్‌ వైపు ప్రయాణించే వాహనదారులు సులువుగా ప్రయాణం చేయవచ్చు.

ఇందుకోసం జీహెచ్‌ఎంసీ ప్రాజెక్ట్‌ ఈఈ సురేశ్‌, బాలాపూర్‌ జలమండలి డిప్యూటీ జీఎం చంద్రశేఖర్‌ బృందం సభ్యులు పర్యటించారు. స్థానిక నాయకులతో చర్చించారు. బ్రిడ్జి పనులు ప్రారంభం కానున్నాయనే విషయం తెలువడంతో వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. చాంద్రాయణగుట్ట ప్రధాన రహదారి జాతీయ రహదారికి అనుసంధానంగా ఉండటంతో ప్రతిరోజూ వాహనాల రాకపోకల సందర్భంగా ట్రాఫిక్‌ జాం ఏర్పడుతుంది.

ప్రస్తుతం వినియోగంలో ఉన్న ఫ్లై ఓవర్‌ బ్రిడ్జికి కొత్తగా నిర్మించే ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిని అనుసంధానంగా నిర్మించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ బ్రిడ్జి నిర్మాణం కోసం 2018-19లోనే నిధులు మంజూరు చేసింది. ప్రస్తుతం రోడ్డు మార్గంలో ఉన్న తాగునీటి పైపులు, విద్యుత్‌ వైర్లు ఇతర ఇబ్బందులను తొలగించే పనిలో సంబంధిత పనిచేస్తున్నారు. మరో నెల రోజుల్లో నూతన బ్రిడ్జి నిర్మాణం ప్రారంభం కానున్నట్లు తెలియజేశారు. బ్రిడ్జి వల్ల ట్రాఫిక్ సమస్యతో బాటు ప్రయాణ సమయం కూడా కనీసంగా తగ్గుతుందని ప్రజలు సంతోషాన్ని వెలిబుచ్చుతున్నారు.

Tags :

Advertisement