Advertisement

  • మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా కానిస్టేబుల్ అరెస్టు

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా కానిస్టేబుల్ అరెస్టు

By: chandrasekar Mon, 13 July 2020 5:01 PM

మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా కానిస్టేబుల్ అరెస్టు


ఓ కానిస్టేబుల్‌ను మహిళతో అసభ్యంగా ప్రవర్తించిన కారణంగా అరెస్టు చేసి జైలుకు పంపించారు. లిఫ్ట్‌ ఇచ్చిన ఓ మహిళలను కానిస్టేబుల్‌ వేధింపులకు గురిచేశాడు. దీంతో బాధిత మహిళ ఫిర్యాదు మేరకు హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌ చర్యలు చేపట్టారు.

సదరు కానిస్టేబుల్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేశారు. అరెస్ట్‌ చేసి జైలు తరలించారు. ఘటన వివరాలిలా ఉన్నాయి. కారులో వెళ్తున్న మహిళను 12వ బెటాలియన్‌కు చెందిన టీఎస్‌ఎస్పీ కానిస్టేబుల్‌ వీరబాబు లిఫ్ట్‌ అడిగాడు.

కారులో ఎక్కిన తర్వాత మహిళ ఫోన్‌ నెంబర్‌ తీసుకున్నాడు. ఆ మరుసటి రోజు నుంచే వేధింపులు మొదలు పెట్టాడు. దీంతో మహిళ వీరబాబుపై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదును అనుసరించి ఉన్నతాధికారులు చర్యలు చేపట్టారు.

సీపీ అంజనీకుమార్‌ స్పందిస్తూ చట్టానికి ఎవరూ అతీతులు కారన్నారు. యూనిఫాంలో ఉన్న ఇటువంటి నేరస్థులు సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నారని మండిపడ్డారు. ఎవరి నుంచైనా ఎటువంటి నానెన్స్‌ను భరించవద్దన్నారు. ఎటువంటి దుష్ప్రవర్తనపై వాట్సాప్‌ నెంబర్‌ 9490616555 కు ఫిర్యాదు చేయాల్సిందిగా తెలిపారు.

Tags :
|

Advertisement