Advertisement

  • పివి నరసింహారావు స్పూర్తితో పని చేసి 2023 లో తెలంగాణాలో అధికారంలోకి వస్తాము ..సోనియా గాంధీ

పివి నరసింహారావు స్పూర్తితో పని చేసి 2023 లో తెలంగాణాలో అధికారంలోకి వస్తాము ..సోనియా గాంధీ

By: Sankar Fri, 24 July 2020 5:09 PM

పివి నరసింహారావు స్పూర్తితో పని చేసి 2023 లో తెలంగాణాలో అధికారంలోకి వస్తాము ..సోనియా గాంధీ



ఇందిరాభవన్‌లో పీవీ జయంతి వేడుకలను తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ.. పీవీ వంగరలో ఓ సామాన్య కార్యకర్తగా పని చేసి ప్రధాని స్థాయికి ఎదిగారు. ఆయనతో వ్యక్తిగతంగా నాకు మంచి పరిచయం. భూసంస్కరణలు తెచ్చిన ఘనత పీవీది. పుట్టుక నుంచి చనిపోయే వరకు కాంగ్రెస్ వాది. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా భూసంస్కరణలు తెచ్చిన గొప్ప నాయకుడు పీవీ. ఆయనకి భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ పీవీపై ప్రశంసల వర్షం కురిపించారు. పీవీ మాకు ఎల్లప్పుడూ గర్వకారణం. ఆయన శతజయంతి వేడుకలను కాంగ్రెస్‌ పార్టీ ఏడాదిపాటు నిర్వహిస్తోంది. పీవీ గురించి ఎవరు వేడుకలు చేసిన స్వాగతిస్తాం. 2023లో పీవీ స్పూర్తితో పనిచేస్తూ తెలంగాణలో అధికారంలోకి వస్తామని సోనియాగాంధీ పేర్కొన్నారు.

మరో సందేశంలో మాజీ ప్రధాని మన్మోహన్‌ పీవీ శతజయంతి వేడుకల నిర్ణయం మంచి ఆలోచన.ఆయన క్యాబినెట్‌లో ఆర్థిక మంత్రిగా తొలి బడ్జెట్‌ ప్రవేశపెట్టడం సంతోషంగా ఉంది. ఆదర్శవంతమైన వ్యక్తి పీవీ. ఆర్థిక సంస్కరణలు తెచ్చిన గొప్ప ప్రధాని. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న సమయంలో ధైర్యంగా నిర్ణయాలు తీసుకున్నారు. పీవీ సంస్కరణల వల్లనే దేశం ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడింది అని మన్మోహన్‌ సింగ్‌ కొనియాడారు..

అయితే భారత దేశం ఆర్ధికంగా మరియు రాజకీయంగా సంధి కాలంలో ఉన్న దశలో ప్రధాని పీఠం ఎక్కిన పివి నరసింహారావు , అప్పటి ఆర్థిక మంత్రి అయిన మన్మోహన్ సింగ్ తో కలిసి దేశ ఆర్ధిక రంగాన్ని కొత్త పుంతలు తొక్కించారు..అనేక ఆర్ధిక సంస్కరణలను ప్రవేశ పెట్టిన పివి తిరిగి ఆర్ధికంగా దేశం బలపడేలా చేసారు

Tags :
|
|

Advertisement