Advertisement

సచిన్ పైలట్ పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు...

By: chandrasekar Wed, 15 July 2020 6:20 PM

సచిన్ పైలట్ పై కాంగ్రెస్ అధిష్టానం చర్యలు...


రాజస్థాన్ ప్రభుత్వ సంక్షోభం నేపధ్యంలో కాంగ్రెస్ అధిష్టానం తిరుగుబాటు నాయకుడు సచిన్ పైలట్ పై చర్యలు తీసుకుంది. తనపై తీసుకున్న చర్యలపై సచిన్ పైలట్ స్పందించి ట్వీట్ చేశారు. రాజస్థాన్ రాష్ట్ర డిప్యూటీ సీఎం, రాష్ట్ర పీసీసీ చీఫ్ పదవుల్నించి తొలగింపు వరకూ వెళ్లింది రాజస్థాన్ రాజకీయ సంక్షోభం. ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తో వివాదం నేపధ్యంలో తిరుగుబాటు బావుటా ఎగరేసిన సచిన్ పైలట్ చివరివరకూ వెనక్కి తగ్గలేదు.

అధిష్టానం నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ససేమిరా అన్నారు. అశోక్ గెహ్లాట్ ను ముఖ్యమంత్రిగా మార్చాల్సిందేనని పట్టుబట్టారు. అటు సచిన్ పైలట్ ను నచ్చజెప్పే పనిలో భాగంగా రెండుసార్లు సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేసినా సచిన్ పైలట్ డుమ్మాకొట్టారు. దాంతో సచిన్ పైలట్ ను డిప్యూటీ సీఎం పదవి, పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుంది. దీనిపై సచిన్ పైలట్ స్పందించారు.

మౌనాన్ని వీడి ట్వీట్ ద్వారా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సత్యాన్నిఇబ్బంది పెట్టవచ్చు కానీ ఓడించలేరని రెండే రెండు ముక్కల్లో ట్వీట్ చేశారు. తనని ఇబ్బంది పెట్టినవారి గురించి, వాస్తవాన్ని మరుగునపెట్టే ప్రయత్నం చేసినవారి గురించి రెండు ముక్కల్లోనే చెప్పే ప్రయత్నం చేశారు. ప్రభుత్వాన్ని కూల్చాలనే కుట్ర ఏకంగా 6 నెలల్నించి సాగుతోందని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ చెప్పారు. సీఎల్పీ సమావేశం అనంతరం గవర్నర్ ను కలిసి తనకు పూర్తి మెజార్టీ ఉందని స్పష్టం చేశారు.

Tags :
|

Advertisement