Advertisement

  • అతడికి పీసీసీ చీఫ్ ఇస్తే నేను పార్టీలో ఉండలేను ...కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత్ రావు

అతడికి పీసీసీ చీఫ్ ఇస్తే నేను పార్టీలో ఉండలేను ...కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత్ రావు

By: Sankar Sat, 26 Dec 2020 3:19 PM

అతడికి పీసీసీ చీఫ్ ఇస్తే నేను పార్టీలో ఉండలేను ...కాంగ్రెస్ సీనియర్ నేత హనుమంత్ రావు


తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితుల్లో ఉంది ...ఒకవైపు అధికార తెరాస , మరోవైపు తెలంగాణాలో పట్టు సాధిస్తున్న బీజేపీ మరోవైపు దీనితో కాంగ్రెస్ అధిష్టానంలో ప్రక్షాళన ఆలోచనలు మొదలయ్యాయి ..ఇదే సమయంలో తెలంగాణాలో కాంగ్రెస్ కూటములకు బాధ్యత వహిస్తూ ఉత్తమ్ పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేయడంతో కొత్త పీసీసీ చీఫ్ వేటలో పడింది కాంగ్రెస్ అధిష్టానం..

అయితే టీపీసీసీ అధ్యక్ష పదవి ఎంపికపై మాజీ ఎంపీ, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత వీహెచ్‌ హనుమంతరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాయకత్వ బాధ్యతలు టీడీపీ నుంచి వచ్చి న రేవంత్‌కు అప్పగించడం సరైనది కాదని నిరసన వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడారని, ఆర్‌ఎస్‌ఎస్‌ బ్యాగ్రౌండ్‌ నుంచి వచ్చారని విమర్శించారు.

అతన్ని పీసీసీ అధ్యక్షుడిగా నియమిస్తే తాను పార్టీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. తనతోపాటు చాలామంది కాంగ్రెస్‌ పార్టీని వీడుతారని వ్యాఖ్యానించారు. పార్టీలోని సీనియర్లను విస్మరిస్తున్నారని, సీనియర్‌ నేతలంతా అసంతృప్తిలో ఉన్నారన్నారు...ప్రస్తుతం హనుమంత్ రావు చేసిన వాక్యాలు కాంగ్రెస్ లో చర్చకు తెరదీసాయి...

Tags :

Advertisement