Advertisement

  • సీఎం కెసిఆర్ పై ఫైర్ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

సీఎం కెసిఆర్ పై ఫైర్ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

By: Sankar Wed, 30 Dec 2020 9:11 PM

సీఎం కెసిఆర్ పై ఫైర్ అయిన కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి


కేసీఆర్ పాలనను అంతమొందిస్తామని, కేసీఆర్ నిర్ణయలు చూస్తే పిచ్చి తుగ్లక్ ఉంటే పిచ్చి తుగ్లక్‌కే పిచ్చి వచ్చేదని మండిపడ్డారు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి..

కొత్త రిజిస్ట్రేషన్లు అని దాన్ని వెనక్కి తీసుకొని మళ్లీ పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌లు చేస్తున్నావని ఫైర్‌ అయ్యారు. మూడు నెలలు రిజిస్ట్రేషన్ల్ అపీ ప్రజలను ఇబ్బంది పెట్టవని విరుచుకుపడ్డారు. నియంత్రణ వ్యవసాయం అని మళ్లీ రద్దు చేశామని, కేసీఆర్‌ నిర్ణయలను చూసి ప్రజలు చిత్కరించుకుంటున్నారని అన్నారు. బుర్ర దగ్గర పెట్టుకొని నిర్ణయాలు తీసుకో అని హితవు పలికారు.

గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే ఉద్యోగులపైన ప్రేమ పుట్టుకచ్చిందా? అని సూటిగా ప్రశ్నించారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే ఎమ్మెల్సీ ఎన్నికలలోపే ఉద్యోగులకు వేతనాల పెంపు, వయో పరిమితి పెంపు, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు.

Tags :
|
|
|

Advertisement