Advertisement

పార్టీ మార్పుపై స్పందించిన జానారెడ్డి

By: Sankar Wed, 09 Dec 2020 7:30 PM

పార్టీ మార్పుపై స్పందించిన జానారెడ్డి


తెలంగాణాలో వరుసగా విజయాలతో ఒక్కసారిగా బీజేపీ పార్టీ స్పీడ్ అందుకుంది ..నిన్న మొన్నటి వరకు తెలంగాణాలో తెరాస కు ప్రధాన ప్రత్యర్థి అంటే కాంగ్రెస్ అనే భావించారు , కానీ దుబ్బాక ఉప ఎన్నిక విజయం , జిహెచ్ఎంసి సంచలన విజయాలు ఇలా అన్ని చోట్ల విజయాలతో బీజేపీ తెరాస కు గట్టిషాక్ ఇచ్చింది..దీనితో 2023 ఎన్నికలలో పోటీ ప్రధానంగా తెరాస , బీజేపీ మద్యే అని అందరు భావిస్తున్నారు...దీనితో కాంగ్రెస్ నుంచి చాల మంది బీజేపీ లోకి వలస పోతారు అన్నట్లు ప్రచారం జరుగుతుంది ..

ఇక నాగార్జునసాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో రాబోయే ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని జానాపై ఆకర్షణ వల విసిరేందుకు టీఆర్‌ఎస్‌, బీజేపీ పోటీపడుతున్నాయనే వార్తలు గుప్పుమన్నాయి.. రెండు పార్టీల నాయకులు ఫోన్ల ద్వారా ఎడతెగని మంతనాలు చేశారని తెలుస్తోంది.. ఇక, జానారెడ్డి సిటీలోకి ఎంట్రీ ఇవ్వడంతో ఈ మంతనాలు, మంత్రాంగాలు ఊపందుకున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే సమయంలో.. ఆయన బీజేపీ నేతలకు షరతులు పెట్టారని టాక్ నడుస్తోంది.. ఈ సమయంలో.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు జానారెడ్డి.

పార్టీ మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతోన్న సమయంలో సీనియర్ నేత జానారెడ్డికి ఏఐసీసీ ఇంఛార్జి ఠాగూర్ ఫోన్ చేశారు.. పార్టీ మార్పు పై జరుగుతున్న చర్చపై జానారెడ్డితో మాట్లాడారు ఠాగూర్.. ఈ సందర్భంగా జానారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు... తాను పార్టీ మారుతున్నట్టుగా తప్పుడు ప్రచారం జరుగుతోందన్న జానారెడ్డి.. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తాను సీఎం క్యాండెట్‌ని.. నేనెందుకు పార్టీ మారతను? అంటూ ఎదురుప్రశ్నించారు..

Tags :
|

Advertisement