Advertisement

  • కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయిన ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయిన ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి

By: Sankar Mon, 21 Dec 2020 4:37 PM

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఫైర్ అయిన ఎమ్యెల్సీ జీవన్ రెడ్డి


అంబానీలు, అదానీల జేబులు నింపడానికే వ్యవసాయ చట్టాలు అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫైర్‌ అయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ ఎదుట ఇవాళ కాంగ్రెస్ ధర్నా నిర్వహించింది. ఫసల్ భీమా పరిహారం కోసం చేపట్టిన ఈ ధర్నాలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను నమ్మించి మోసం చేస్తున్నాయని... దేశంలో పెద్ద మోడీ... రాష్ట్రంలో చిన్న మోడీ పాలనలో రైతులకు గిట్టుబాటు ధర రావడం లేదని మండిపడ్డారు. కేంద్రం అమలు చేస్తున్న వ్యవసాయ చట్టాలతో... రైతులను కొట్టి ప్రైవేట్ గద్దలకు పెడుతుందన్నారు. రైతులు మద్దతు ధర ఇవ్వమని డిమాండ్ చేస్తుంటే దేశంలో ఎక్కడైనా పంట అమ్ముకోవచ్చని చెప్పడం సిగ్గు చేటని ఫైర్‌ అయ్యారు.

మద్దతు ధరనే దక్కకపోతే రైతు ఎక్కడ అమ్ముకున్న ఒక్కటేన్నారు. పంజాబ్ రైతుల పోరాటం అందరూ ఆదర్శంగా తీసుకోవాలని.... గడ్డ కట్టే చలిలో వ్యవసాయ చట్టాల రద్దుకు రైతులు చేస్తున్న పోరాటం దేశ సైనికుల పోరాటంతో సమానమని కొనియాడారు

Tags :
|
|
|

Advertisement