Advertisement

  • గాంధీ ఆస్పత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

గాంధీ ఆస్పత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి

By: chandrasekar Thu, 30 July 2020 7:21 PM

గాంధీ ఆస్పత్రిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి


కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మరోసారి తనదైన శైలిలో సంచలన, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కరోనా సోకిన వారు గాంధీ ఆస్పత్రికి వెళ్తే చాలు వారు శవమైపోతారని వ్యాఖ్యానించారు. బుధవారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. రెండ్రోజుల క్రితం జరిగిన ఓ ఘటనను గుర్తు చేశారు. రెండు రోజుల క్రితం సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి నుంచి కరోనా పేషెంట్‌ని గాంధీ ఆస్పత్రికి రెఫెర్ చేశారు.

గాంధీకి రెఫెర్ చేయొద్దని అదే రోజు నేను సూపరిండెంట్‌కు చెప్పా. అయినా పంపించారు. గాంధీకి వెళ్లిన పేషెంట్ బుధవారం మరణించారు. గాంధీకి వెళ్తే శవమై వస్తామని ప్రజలు భయపడుతున్నారు. కాంగ్రెస్ కౌన్సిలర్ సైతం గాంధీ ఆస్పత్రికి పంపించిన తర్వాతే చనిపోయింది.

అధికారులు, మంత్రి, సంగారెడ్డి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్‌ని ప్రారంభించామని చెప్పారు. మంచి భోజనం కూడా ఏర్పాటు చేశామన్నారు. ఆస్పత్రిలో ఒక డాక్టర్‌ని పెట్టాలనే ఆలోచన కూడా చేయలేదు. సంగారెడ్డి ఆస్పత్రిలో తక్షణమే డాక్టర్లు కావాలి. సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం కాస్త టీఆర్ఎస్ పార్టీ కార్యాలయం లాగా మారింది.

శ్రీనివాస్ తల్లి చనిపోవడానికి కారణం కేవలం ప్రభుత్వమే. నాపై ఎన్ని కేసులైన పెట్టికోండి. మృతదేహంతో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రి ముందు లేదా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తా. ఇవాల్టి నుంచి సంగారెడ్డి ప్రజల పక్షాన పోరాటం చేస్తా అని జగ్గారెడ్డి హెచ్చరించారు.

Tags :

Advertisement