Advertisement

  • పీసీసీ చీఫ్ కోసం అభిప్రాయసేకరణ జరగడం దురదృష్టకరం ..జగ్గారెడ్డి

పీసీసీ చీఫ్ కోసం అభిప్రాయసేకరణ జరగడం దురదృష్టకరం ..జగ్గారెడ్డి

By: Sankar Wed, 09 Dec 2020 4:06 PM

పీసీసీ చీఫ్ కోసం అభిప్రాయసేకరణ జరగడం దురదృష్టకరం ..జగ్గారెడ్డి


గత కొంతకాలంగా తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలహీనపడుతూ వస్తుంది..దీనికి నిదర్శనంగా దుబ్బాక ఉప ఎన్నిక ,జిహెచ్ఎంసి ఉప ఎన్నికలో కూటములే సాక్ష్యం ...దీనితో ఆ పార్టీ తెలంగాణ పిసిసి చీఫ్ ఉత్తమ్ ఆ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే..

అయితే కాంగ్రెస్ పార్టీ బలహీనం కాలేదని, సంస్థాగతంగా ఇంకా బలంగా ఉందని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. అయితే పీసీసీ అధ్యక్షుడి కోసం మొదటిసారి ఇలా అభిప్రాయ సేకరణ జరగడం దురదృష్టకరమన్నారు. గతంలో ఇలా ఎన్నడూ జరగలేదని తెలిపారు. ఈసారి పీసీసీ అధ్యక్షుడి కోసం చాలా కాంపిటీషన్ ఉందని, రేసులో తనతో పాటు మరికొంతమంది ఉన్నట్లు తెలిపారు...

కాగా ఉత్తమ్ రాజీనామా తర్వాత పిసిసి చీఫ్ పదవి కోసం పార్టీ లో ఉన్న అనేక మంది సీనియర్లు పోటీపడుతున్నారు..రేవంత్ రెడ్డి , కోమటి రెడ్డి వంటి వారు తమ ప్రయత్నాలు చేస్తున్నారు..ఇక ఈ విషయంపై నేడు సాయంత్రం 4 గంటలకు పార్టీ ఇంచార్జ్‌ మాణిక్యం ఠాగూర్ హైదరాబాద్‌ రానున్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ కోర్‌ కమిటీ సమావేశంలో అన్ని వర్గాల వారి అభిప్రాయ సేకరణ తీసుకొని పీసీసీ అధ్యక్షుడిని నియమించనున్నారు..

Tags :

Advertisement